సుశాంత్ తండ్రితో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ
సుశాంత్ తండ్రి కేకే ఖాన్ తో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ అయ్యారు. ఫరీదాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో సుశాంత్ సోదరి రాణి సింగ్ కూడా పాల్గొన్నారు. తన సోదరుని మృతికి దారి తీసిన పరిస్థితులను..
సుశాంత్ తండ్రి కేకే ఖాన్ తో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ అయ్యారు. ఫరీదాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో సుశాంత్ సోదరి రాణి సింగ్ కూడా పాల్గొన్నారు. తన సోదరుని మృతికి దారి తీసిన పరిస్థితులను ఆమె ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. సుశాల్ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా ఖట్టర్ హామీ ఇచ్చారు. సుశాంత్ బావ ఓ.పి.సింగ్ ప్రస్తుతం ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు.
సుశాంత్ ప్రేమగా పెంచుకున్న పెట్ డాగ్ ‘ఫడ్జ్’ ఆలనా పాలనను ఆయనే చూసుకుంటున్నారు. కాగా-తమ అభిమాన నటుడి మృతిని హర్యానా వాసులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసులో సుశాంత్ ఫ్యామిలీకి న్యాయం జరగాలని, ఆయనను హత్య చేశారని వార్తలు వస్తున్న తరుణంలో అసలు సూత్రధారులను అరెస్ట్ చేసి శిక్షించాలని వారు కోరుతున్నారు.