జామ్-2021 నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 14న పరీక్ష!
భారత్ లో అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్), ఐఐటీల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేయడానికి ప్రవేశాలు కల్పించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)-2021 నోటిఫికేషన్
భారత్ లో అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్), ఐఐటీల్లో ఎమ్మెస్సీ కోర్సులు చేయడానికి ప్రవేశాలు కల్పించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)-2021 నోటిఫికేషన్ విడుదలైంది. జామ్‌ను ఈ ఏడాది ఐఐఎస్ బెంగళూరు నిర్వహించనుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ వచ్చేనెల 10 న ప్రారంభమవుతుందని, ఆక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని ఐఐఎస్ బెంగళూరు ప్రకటించింది. పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న జరుగుతుందని తెలిపింది.
నేషనల్ లెవెల్లో ఈ కోర్సులో ఇప్పటివరకు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, జియాలజీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. ఈసారి కొత్తగా ఎకనామిక్స్‌ను ప్రవేశపెట్టింది. దీంతో మొత్తం సబ్జెక్టుల సంఖ్య ఏడుకు చేరింది. జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష అయిన జామ్ ద్వారా ఐఐటీల్లో ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ, ఇతర పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాముల్లో, ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
పూర్తి వివరాలకు jam.iisc.ac.in క్లిక్ చేయండి.
Read More:
ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?
జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్స్..!