AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H1B VISA: USA..ముగుస్తున్నహెచ్ 1 బీ వీసా గడువు.. భారతీయ విద్యార్థుల్లో గుబులు

అమెరికా డాలర్‌ డ్రీమ్స్‌ కంట్రీ. అగ్రరాజ్యంలో జాబ్‌ చేయాలనేది యూత్‌ టార్గెట్‌. అక్కడ ఎమ్మెస్‌ చేస్తే ఉద్యోగం ఈజీగా వస్తుందనే ఆశతో అమెరికా ఫ్లైటేక్కేస్తుంటారు. కానీ అక్కడ జాబ్‌ చేయాలంటే హెచ్‌ 1 బీ వీసా కంపల్సరీ. అగ్రరాజ్యం వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో హెచ్‌ 1 బీ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యువత. ఈ ఏప్రిల్‌ నాటికి 68 వేల మంది టెకీలకు గడువు ముగుస్తుండటంతో వారంతా అయోమయంలో పడ్డారు. ఈసారి కూడా వీసా […]

H1B VISA:  USA..ముగుస్తున్నహెచ్ 1 బీ వీసా గడువు.. భారతీయ విద్యార్థుల్లో గుబులు
Pardhasaradhi Peri
|

Updated on: Feb 18, 2020 | 3:44 PM

Share

అమెరికా డాలర్‌ డ్రీమ్స్‌ కంట్రీ. అగ్రరాజ్యంలో జాబ్‌ చేయాలనేది యూత్‌ టార్గెట్‌. అక్కడ ఎమ్మెస్‌ చేస్తే ఉద్యోగం ఈజీగా వస్తుందనే ఆశతో అమెరికా ఫ్లైటేక్కేస్తుంటారు. కానీ అక్కడ జాబ్‌ చేయాలంటే హెచ్‌ 1 బీ వీసా కంపల్సరీ. అగ్రరాజ్యం వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో హెచ్‌ 1 బీ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యువత. ఈ ఏప్రిల్‌ నాటికి 68 వేల మంది టెకీలకు గడువు ముగుస్తుండటంతో వారంతా అయోమయంలో పడ్డారు. ఈసారి కూడా వీసా రాదేమోనని ఆందోళన చెందుతున్నారు.

2015-16లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏటికేడాది అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య అధికమవుతుండటంతో వీసా రాక ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎమ్మెస్‌ పూర్తి చేసి ఓపీటీ అర్హతతో 68వేల మంది భారతీయులు ఉద్యోగం చేస్తున్నారు. వారిలో 20 నుంచి 24వేల మంది తెలుగు వారున్నారు. వారందరికీ మూడేళ్లకిచ్చే ఓపీటీ ఈ ఏడాదితో పూర్తి కానుంది. ఇప్పటికే రెండుసార్లు హెచ్‌1 బీ వీసా అవకాశం కోల్పోయిన వారికి ఈ ఏప్రిల్‌ చివరి అవకాశం. అప్పుడు కూడా వీసా రాకపోతే స్వదేశానికి వెళ్లడం లేదా మళ్లీ ఏదైనా కోర్సు చేయడమో చేయాలి. ఐతే అక్కడ మళ్లీ చదువుకోవడమనేది ఆర్థిక స్తోమత లేని వారికి చాలా కష్టమైన పని. దీంతో వీసా సమస్య నుంచి బయటపడేందుకు భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు..హెచ్‌ 1 బీ వీసా ఉన్న జీవిత భాగస్వాముల కోసం ప్రయత్నిస్తున్నారు. వారిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండే అవకాశముందనే యోచనలో ఉన్నారు.

ఏటా అమెరికా 85వేల మందికి హెచ్‌ 1 బీ వీసాలు మంజూరు చేస్తుంది. కానీ హెచ్‌ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ ఏడాది అది లక్షన్నర దాటుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండేళ్లలో 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని..65 నుంచి 70వేల మందికి మాత్రమే వీసాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా వీసా రాదేమోనని ఆందోళన చెందుతున్నారు.