‘ఆయనతో నాకు పోలికా ? నా ఎద్దులు నాకు చాలు’.. కంబాలా జాకీ
తన ఎద్దులతో కంబాలా ట్రాక్ పై 13.62 సెకండ్లలో 142.5 మీటర్ల దూరం పరుగెత్తి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కంబాలా జాకీ.. శ్రీనివాస గౌడ.. తనను ఒలంపిక్ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ తో పోల్చవద్దని వేడుకుంటున్నాడు. తనకు తన ఎద్దులే చాలని వినమ్రంగా వ్యాఖ్యానించాడు. కర్ణాటకలోని కోస్టల్ బెల్ట్ కు చెందిన ఈ 28 ఏళ్ళ యువకుడు.. బిడియంగా మాట్లాడుతూ.. ఆ స్ప్రింటర్ తో పోల్చదగినంత వాడిని తాను కానని చెప్పాడు. (ఉసేన్ […]
తన ఎద్దులతో కంబాలా ట్రాక్ పై 13.62 సెకండ్లలో 142.5 మీటర్ల దూరం పరుగెత్తి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కంబాలా జాకీ.. శ్రీనివాస గౌడ.. తనను ఒలంపిక్ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ తో పోల్చవద్దని వేడుకుంటున్నాడు. తనకు తన ఎద్దులే చాలని వినమ్రంగా వ్యాఖ్యానించాడు. కర్ణాటకలోని కోస్టల్ బెల్ట్ కు చెందిన ఈ 28 ఏళ్ళ యువకుడు.. బిడియంగా మాట్లాడుతూ.. ఆ స్ప్రింటర్ తో పోల్చదగినంత వాడిని తాను కానని చెప్పాడు. (ఉసేన్ 9.55 సెకండ్లలో 100 మీటర్లు పరుగెత్తి వాల్డ్ రికార్డ్ సృష్టించాడు). అసలు ట్రాక్ పై తానెప్పుడూ శిక్షణ పొందలేదని, కేవలం కంబాలా ట్రాక్ మాత్రమే తన పరిధి అని చెప్పిన గౌడ.. బురద నిండిన పొలంలో తన ఎద్దులతో పరుగెడుతుంటానన్నాడు. వాటిని కంట్రోల్ చేయడానికి నేను వట్టి కాళ్లతో పరుగులు తీస్తుంటాను. కానీ ఉసేన్ స్పైక్ తో కూడిన బూట్లతో రన్ చేస్తాడు.. అని గౌడ పేర్కొన్నాడు. పైగా స్పోర్ట్స్ సెంటర్లో శిక్షణ పొందే ఉద్దేశం తనకు లేదని, తన గురువు చెబితే ఆ విషయం ఆలోచిస్తానని అన్నాడు. హార్డ్ గ్రౌండ్ ట్రాక్ లో పరుగెత్తాలంటే చాలా ట్రెయినింగ్ కావాలి.. నేను బురదతో నిండిన పొలంలో చేసే పరుగులకు, దానికి పోలికే లేదు అన్నాడు.
మంగుళూరులోని కంబాలా అకాడెమీలో ఫస్ట్ బ్యాచ్ విద్యార్ధి అయిన శ్రీనివాస గౌడని కర్ణాటక సీఎం ఎదియూరప్ప.. 3 లక్షల నగదుబహుమతినిఛ్చి సత్కరించారు. అటు-క్రీడల మంత్రి కిరణ్ రిజిజు.. బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆహ్వానించడమే గాక.. సీనియర్ కోచ్ లతో ఇతనికి శిక్షణ ఇప్పిస్తామని ప్రకటించారు. అయితే శ్రీనివాస గౌడ మాత్రం ఇందుకు సున్నితంగా తిరస్కరించాడు.