AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్: గుత్తా జ్వాల ప్రశ్నలకు సమాధానాలున్నాయా..!

దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కార్తీ చిదంబరం, సీతారాం తదితరులు ఉన్నారు. ఇక ఈ రోజు జరిగిన పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఎన్‌కౌంటర్‌ అంశం మీదే పెద్ద చర్చ జరిగింది. […]

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్: గుత్తా జ్వాల ప్రశ్నలకు సమాధానాలున్నాయా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 07, 2019 | 8:10 PM

Share

దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కార్తీ చిదంబరం, సీతారాం తదితరులు ఉన్నారు. ఇక ఈ రోజు జరిగిన పార్లమెంట్ ఉభయసభల్లోనూ ఎన్‌కౌంటర్‌ అంశం మీదే పెద్ద చర్చ జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చేసిన ట్వీట్‌ అందరిలో పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

ఈ ఎన్‌కౌంటర్‌పై ట్వీట్ చేసిన గుత్తా జ్వాల.. ‘‘దీని వలన భవిష్యత్‌లో అత్యాచారాలు ఆగుతాయా..? సామాజికపరంగా ఎదురయ్యే ప్రతిఘటనలు పట్టించుకోకుండా ప్రతి రేపిస్ట్‌కు ఇదే శిక్ష వేస్తారా..?’’ అంటూ ఆమె ప్రశ్నించింది. అయితే గుత్తా జ్వాల ఒక్కరే కాదు. చాలా మంది ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలనే సంధిస్తున్నారు. ఇటీవల కాలంలోనే తెలంగాణలో పలు అత్యాచార ఘటనలు జరిగాయి. హాజీపూర్‌లో ఓ సీరియల్ కిల్లర్.. ముగ్గురు మైనర్ బాలికలను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయగా.. హన్మకొండలో అమ్మ పక్కన పడుకున్న తొమ్మిది నెలల బాలికను ఎత్తుకెళ్లి హత్యాచారం చేశాడు ఓ సైకో. ఇవి రెండే కాదు దిశ హత్యాచారం జరిగిన రోజే.. వరంగల్‌లో మానస అనే మైనర్ యువతి హత్యాచారానికి గురైంది. అదే రోజు ఆమె పుట్టినరోజు కావడం అందరినీ బాధించిన అంశం. అయితే ఈ అన్ని కేసుల్లో నిందితుల తప్పు రుజువైనా.. ఎలాంటి చర్యలు లేవు. ఇక ఇప్పుడు వీరిని ఎన్‌కౌంటర్ చేయడంపై చాలా మంది గుత్తా జ్వాలా రేకెత్తించిన ప్రశ్నలనే సంధిస్తున్నారు.

Follow Us
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
22 ఏళ్లకే రూ.46 వేలు.. బీకామ్ చదివి క్యాబ్ డ్రైవర్‌గా మారిన యువకు
3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
3 రోజుల్లోనే కొత్తిమీర సులువుగా పెంచే సరికొత్త సింపుల్ చిట్కా
షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. మీకు సరిపోయే రైస్ ఏదో తెలుసా?
షుగర్ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. మీకు సరిపోయే రైస్ ఏదో తెలుసా?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
శుభమన్ గిల్ జట్టుకు దూరం కావడానికి కారణం ఏంటి?
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
అరటిపండా.. నారింజా? బీపీ కంట్రోల్‌కు ఏ పండు బెస్ట్
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
ఇడ్లీ కుక్కర్‌ను ఇలా కూడా వాడొచ్చా? వీటిని మస్ట్ ట్రై
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!