Parasailing: హనీమూన్‌కు వెళ్లిన జంటకు చేదు అనుభం.. పారాసైలింగ్ చేస్తు విహరించాలనుకున్నారు.. కానీ..

కొందరికి నీళ్లంటేనే భయం.. అలాంటిది సముద్రంపై పారాచూట్‌ సాయంతో గాల్లోకి ఎగరడం అంటే ఓ సాహసమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ

Parasailing: హనీమూన్‌కు వెళ్లిన జంటకు చేదు అనుభం.. పారాసైలింగ్ చేస్తు విహరించాలనుకున్నారు.. కానీ..
Gujarati Couple Goes For Pa
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Nov 17, 2021 | 7:09 PM

కొందరికి నీళ్లంటేనే భయం.. అలాంటిది సముద్రంపై పారాచూట్‌ సాయంతో గాల్లోకి ఎగరడం అంటే ఓ సాహసమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సముద్రంలో పడిపోతే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూనే ఉంటారు కొందరు. మరి అలాంటిది గాల్లో ఉండగా పారాసెయిలింగ్‌ తాడు తెగిపోతే…వారు సముద్రంలో పడిపోతే.. ప్రాణాలు ఉంటాయో, గాల్లో కలిసిపోతాయో..అప్పుడు భయం ఎలా ఉంటుందో.. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ జంటకు. గుజరాత్‌కు చెందిన అజిత్‌ కథడ్‌, సరళా కథడ్‌ దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారా సెయిలింగ్‌ చేయాలని ఆశపడ్డారు.

నిర్వాహకులు పవర్‌ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకెగిరేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే పవర్‌ బోటుకు, పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు ఒక్కసారిగా తెగిపోయింది. వారు కొద్దిదూరం వెళ్లి సముద్రంలో పడిపోయారు.

దీంతో అక్కడ ఒక్కసారిగా భయం.. భయం. బోటులో ఉన్న అజిత్‌ కథడ్‌ సోదరుడు రాకేశ్‌ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. వారికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి:

ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..

Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..