పెళ్లయిన నాలుగో రోజే భర్తను హతమార్చిన భార్య.. అసలు కారణం తెలిసి షాక్!

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. తన బంధువును ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే హత్యకు గురయ్యాడు.

పెళ్లయిన నాలుగో రోజే భర్తను హతమార్చిన భార్య.. అసలు కారణం తెలిసి షాక్!
Gujarat Crime
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 15, 2024 | 3:04 PM

గుజరాత్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన బంధువును ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే నవ వరుడు హత్యకు గురయ్యాడు. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. వాస్తవానికి ఆమె తన కజిన్ సోదరుడిని ప్రేమించింది. కానీ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించకపోవడంతో అమ్మాయిని వేరొకరితో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగో రోజే ప్రియుడితో కలిసి ఆ యువతి భర్తను హత్య చేసింది.

అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్న భావిక్‌ గాంధీనగర్‌కు చెందిన పాయల్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగు రోజులకే కిడ్నాప్‌కు గురయ్యాడు. భార్యను తీసుకురావడానికి భావిక్ తన ఇంటి నుండి అత్తమామల ఇంటికి వెళ్ళిన భావిక్ కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో కుటుంబ సభ్యులు భావిక్ కోసం వెతకడానికి బయలుదేరారు. అత్తమామలు భావిక్ కోసం వెతుకుతుండగా అతడి యాక్టివా కనిపించింది. సమీపంలో విచారించగా.. ఇన్నోవా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు భావిక్‌ను ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని భావిక్ కుటుంబసభ్యులకు అందించారు. ఆ తర్వాత భవిక్ తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో భార్యపై పోలీసులకు అనుమానం వచ్చింది.

పోలీసుల విచారణలో అతడి భార్య పాయల్‌ హస్తం ఉన్నట్లు తేలింది. పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె నేరం అంగీకరించిందని కలోల్ డిప్యూటీ ఎస్పీ పిడి మన్వర్ చెప్పారు. ఆమె కజిన్ సోదరుడిని ప్రేమించింది. కానీ కుటుంబసభ్యులు ఆమెను భావిక్‌తో వివాహం జరిపించారు. ఆ తర్వాత పాయల్, కల్పేష్ భావిక్‌ను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ చేశారు. ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో, వివాహానికి ముందు ప్రేమిస్తున్న తన బంధువు కల్పేష్‌తో కలిసి పాయల్ తన భర్త హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లయిన నాలుగో రోజున, భావిక్ తన అత్తమామల ఇంటికి వెళ్తుండగా, పాయల్ తన లొకేషన్ అడిగి కల్పేష్‌కి ఇచ్చింది. ఆ తర్వాత కల్పేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇన్నోవాలో వెళ్లి భావిక్ యాక్టివాను ఢీకొట్టాడు. దీంతో భావిక్ కిందపడిపోయాడు. అతన్ని కారులో ఎక్కించుకుని గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత ఆచూకీ లభించకుండా భావిక్ మృతదేహాన్ని నర్మదా కాలువలో పడేసినట్లు కల్పేష్ పోలీసులకు చెప్పాడు. భావిక్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసినందుకు కల్పేష్, అతని ఇద్దరు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.పాయల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన బంధువు ప్రేమలో పడిన పాయల్, పెళ్లయిన నాలుగో రోజే భర్తను హత్య చేసి, ఇప్పుడు ఆమె జీవితాంతం జైలులోనే గడపాల్సి వస్తుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..