రోజుకో స్పూన్.. పొట్ట గుట్టలా ఉన్నా కరగాల్సిందే.

15 December 2024

Ravi Kiran

అధికంగా బరువు పెరగడం లేదా ఊబకాయం అనేది చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది.

స్థూలకాయం వల్ల ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఆస్టిటిస్, నిద్ర సమస్యలు పెరుగుతాయి.

ఇలాంటి ఎన్నో సమస్యలను నెయ్యి దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి. మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి.

నెయ్యిలో బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి సహాయపడే మంచి కొవ్వులు ఉన్నాయని పేర్కొన్నారు.

నెయ్యి తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో నెయ్యి కూడా సహాయపడుతుంది. బరువు సమతుల్యతకు ఇది చాలా ముఖ్యమైన భాగం.

నెయ్యి తీసుకుంటే.. ఎక్కువ సేపు ఆకలి వేయదు. మీరు దీనితో సంతృప్తి చెందవచ్చు.