Komatireddy Rajagopal Reddy: ఆ ఎమ్మెల్యే ఏం చేసిన సంచలనమే.. తాజాగా ఏం చేశారో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆరు కొత్త బస్సులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరంగా స్వయంగా బస్సును నడిపారు.
ఆయనో ప్రజా ప్రతినిధి.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉంటారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు. ప్రజలకు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఆయన బస్సు డ్రైవర్‌గా మారిపోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా కొత్త అవతారమెత్తిన ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
మాస్ లీడర్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నిత్యం ఏదో ఒక హాట్ కామెంట్స్ హల్ చల్ చేస్తుంటారు. ఒకసారి వైన్ షాప్‌లోకి మద్యం రేట్లను పరిశీలించారు. మరోసారి ఏకంగా ఉదయం వైన్ షాప్ పర్మిట్ రూమ్‌లోకి వెళ్లి, మద్యం ప్రియులను బయటకు పంపి హల్చల్ చేశారు. ఈసారి మరో కొత్త అవతారం ఎత్తారు.
మునుగోడు నియోజకవర్గంలోని గ్రామీణ పల్లెలకు ప్రజా రవాణా వ్యవస్థపై స్థానిక ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. అన్ని ఊర్లకు బస్సు రావాలంటూ ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో పల్లెపల్లెకు ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆరు కొత్త బస్సులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపి బస్సు డ్రైవర్ గా మారిపోయారు. నియోజక వర్గానికి ఆరు బస్సులను మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సులను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి కోరారు.
వీడియో చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..