గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సూరత్‌లోని పాండెసరా ప్రాంతంలో గల ఓ టెక్స్‌టైల్ మిల్లులో జూన్ 4 శనివారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు మిల్లు మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో భయానకంగా మారింది. మంటలు గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 పైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఆస్తినష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
Gujarat | A fire broke out at a textile mill in the Pandesara area of Surat last night.
ఇవి కూడా చదవండిFire officer Falgun Kumar said, “15-20 firefighters reached the spot. No casualties have been reported yet.” pic.twitter.com/7bB3XrzN0w
— ANI (@ANI) June 5, 2022
ఇదిలా ఉంటే, శనివారం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలోనూ ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోవడంతో 12 మంది చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 25 మంది కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల పలు ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయి. గాయపడిన వారికి చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోందని ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. అగ్నిప్రమాద ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని యూపీ సీఎం ఆదేశించారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయం అందించాలని కోరారు. అలాగే క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.