Gujarat Elections: గుజరాత్‌లో ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం.. దుమారం రేపుతున్న ఖర్గే వ్యాఖ్యలు..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. డిసెంబర్‌ 1న గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ జరుగుతుంది. తొలిదశ పోలింగ్‌లో 89 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరుగుతాయి.

Gujarat Elections: గుజరాత్‌లో ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం.. దుమారం రేపుతున్న ఖర్గే వ్యాఖ్యలు..
Gujarat Elections
Follow us

|

Updated on: Nov 29, 2022 | 7:12 PM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ప్రచారం ముగిసింది. డిసెంబర్‌ 1న గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ జరుగుతుంది. తొలిదశ పోలింగ్‌లో 89 అసెంబ్లీ సీట్లలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్‌ 5వ తేదీన రెండో దశ పోలింగ్‌ జరుగుతుంది. రెండోదశలో 93 స్థానాల్లో ఎన్నికలు ఉంటాయి. కాగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ప్రధాని మోదీ , కేంద్రమంత్రి అమిత్‌షా , బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రచార బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. వారంలో నాలుగు రోజులు గుజరాత్‌ లోనే గడుపుతున్నారు ప్రధాని మోదీ. ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోకపోతే ఆ ప్రభావం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీపై పడుతుందని భావిస్తున్న బీజేపీ.. తీవ్రంగా పోరాడుతోంది.

ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రగడ..

అయితే గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. మోదీ 100 తలలు ఉన్న రావణాసురుడి లాంటి వాడని అన్నారు. గల్లీ ఎన్నికల్లో కూడా మోదీ ప్రచారం చేస్తూ తరచుగా మాటల మారుస్తున్నారని అన్నారు. ‘‘ఎవరి ముఖం చూడవద్దు. నా ముఖం చూసి ఓటేయ్యాలని మోదీ అంటారు. ఎన్నిసార్లు మీ ముఖం చూడాలి. కార్పొరేషన్‌ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో నా ముఖమే చూసి ఓటేయ్యాలని అడుగుతారు. ఎన్నిసార్లు చూడాలి. మీరు రావణుడి లాగా 100 తలలు ఉన్నాయా?’’ అని సీరియస్ కామెంట్స్ చేశారు ఖర్గే. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడి కామెంట్స్‌పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గుజరాత్‌ ప్రజలు ఓట్ల రూపంతో కాంగ్రెస్‌కు గట్టి బుద్ది చెబుతారని కౌంటరిచ్చారు.

ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య ముక్కోణపు పోరు సాగుతోంది. ఇందులో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా.. దానికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, ఆప్ పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల చీలికపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..