AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెప్పుడూ చూడలే..! ఓ వైపు పెళ్లి.. మరోవైపు పని లొల్లి.. అబ్బో ఈ వరుడి పరిస్థితి..

పెళ్లి వేడుక అంటే.. హడావుడి అంతా ఇంత కాదు.. కుటుంబసభ్యులంతా వివాహా వేడుకలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఓ వైపు వరుడి కుటుంబసభ్యులు.. మరోవైపు వధువు బంధువులు.. నూతన జంటను చూసి ఆనందపడిపోతుంటారు.

ఇదెప్పుడూ చూడలే..! ఓ వైపు పెళ్లి.. మరోవైపు పని లొల్లి.. అబ్బో ఈ వరుడి పరిస్థితి..
Viral Photo
Shaik Madar Saheb
|

Updated on: Nov 29, 2022 | 7:01 PM

Share

Work from mandap: పెళ్లి వేడుక అంటే.. హడావుడి అంతా ఇంత కాదు.. కుటుంబసభ్యులంతా వివాహా వేడుకలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఓ వైపు వరుడి కుటుంబసభ్యులు.. మరోవైపు వధువు బంధువులు.. నూతన జంటను చూసి ఆనందపడిపోతుంటారు. ఇలాంటి పెళ్లి వేడుకలో.. ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పెండ్లి మండ‌పంలోనూ నూతన వరడు ల్యాప్‌టాప్‌తో కుస్తీ ప‌డుతున్న ఫొటో సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఏంటయ్య ఇది.. పెళ్లిలోనూ వదిలిపెట్టరా..? అతన్ని అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కోల్ కతాకు సంబంధించిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

పెళ్లి వేడుకకు సంబంధించిన ఈ వైరల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో ig_calcutta అనే యూజర్ షేర్ చేయగా.. నెటిజన్లు ఈ ఫన్నీ ఫొటోకు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలో కోల్‌క‌తాకు చెందిన పెండ్లి కొడుకు పెండ్లి మండ‌పంపై ఇద్దరు పురోహితుల‌తో క‌లిసి కూర్చున్నాడు. పెండ్లికొడుకు ల్యాప్‌టాప్‌పై ఏదో ప‌నిచేస్తూ బిజీగా ఉండగా.. పురోహితులు అతన్ని ఆశీర్వదిస్తూ క‌నిపించారు. దీనికి వ‌ర్క్ ఫ్రం హోం.. నెక్ట్స్ లెవెల్ ఇదేనంటూ యూజర్ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. వైర‌ల్‌గా మారిన ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు దాదాపు 11 వేల లైక్స్ వ‌చ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ ఫొటో..

అయితే, వరుడు ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నాడనేది క్లారిటీ లేదు. అయినప్పటికీ ఏదో ఎమర్జెన్సీ వర్కే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్‌చల్‌ చేస్తుండటంతో.. ఇలాంటివి ఎక్కడా చూడలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. కరోనా కాలంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇవ్వడంతో.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం..