AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: భారత సైనికుల వీరగాథలతో ప్రదర్శన.. నాడబెట్‌లో వ్యూపాయింట్‌ను ప్రారంభించిన అమిత్ షా

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నడబెట్‌లో భారత్ పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుపై వ్యూ పాయింట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.

Gujarat: భారత సైనికుల వీరగాథలతో ప్రదర్శన.. నాడబెట్‌లో వ్యూపాయింట్‌ను ప్రారంభించిన అమిత్ షా
Amit Shah
Balaraju Goud
|

Updated on: Apr 10, 2022 | 12:10 PM

Share

Viewpoint in Nadabet:” గుజరాత్‌(Gujarat)లోని బనస్కాంత జిల్లా నడబెట్‌లో భారత్ పాకిస్థాన్ (India-Pakistan Border) అంతర్జాతీయ సరిహద్దుపై వ్యూ పాయింట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ మొదటి సరిహద్దు పాయింట్ అయిన ఇక్కడ ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా భారత ఆర్మీకి చెందిన ఆయుధాలతో సహా యుద్ధ ట్యాంకులను ప్రదర్శించడం జరుగుతుంది.

నాడబెట్‌లో కేవలం BSF జవాన్లు మాత్రమే ప్రదర్శన చేస్తారని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నాడబెట్ పాయింట్ భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు 20 నుండి 25 కిలోమీటర్ల ముందు నిర్మించారు. నడబెట్ వ్యూపాయింట్‌లో సైనికుల కథలను మన ముందు ప్రదర్శిస్తారు. పర్యాటకులు వాటిని తాకడం ద్వారా సరిహద్దులోని నక్షత్రాలను అనుభూతి చెందుతారు. అదే సమయంలో ఇది గుజరాత్ టూరిజంకు కూడా ఊతం ఇస్తుంది. ఆర్మీ జవాన్లకు సంబంధించి కవాతును పర్యాటకులు వీక్షించేందుక వీలు ఉంటుంది.

నిషాన్ పేరిట ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నట్లు సమాచారం. ఇది కాకుండా, జిప్ లైనింగ్ నుండి షూటింగ్, క్రాస్‌బౌ, పెయింట్‌బాల్, రాకెట్ ఎజెక్టర్ మొదలైన వాటి వరకు ఆస్వాదించగలిగే అడ్వెంచర్ అరేనా యాక్టివిటీ జోన్ కూడా ఉంది. అదే సమయంలో, BSF కోసం అంకితమైన మ్యూజియం కూడా సిద్ధం చేశారు. ఇందులో MiG 27 యుద్ధ విమానాలు, BSF పిల్లర్ ఉన్నాయి.

Read Also…  Sri Lanka High Alert: శ్రీలంకకు భారత ఇంటెలిజెన్స్ హై అలర్ట్.. తీరం వెంబడి గస్తీ ముమ్మరం