Crime News: అక్రమంగా సంపాదించి కూలిపోయే ఇంట్లో దాచిపెట్టాడు.. చివరకు ఊహించని షాక్

Bhubaneswar Crime News: అతనొక ఇరిగేషన్ అధికారి.. అక్రమంగా ఆస్థులను కూడబెట్టాడు. అవన్నీ ఎక్కడ దాచాలో అర్ధం కాక శిథిలావస్థలో ఉన్న ఇంట్లో దాచిపెట్టాడు. మూడు రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులకు..

Crime News: అక్రమంగా సంపాదించి కూలిపోయే ఇంట్లో దాచిపెట్టాడు.. చివరకు ఊహించని షాక్
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 10, 2022 | 12:15 PM

Bhubaneswar Crime News: అతనొక ఇరిగేషన్ అధికారి.. అక్రమంగా ఆస్థులను కూడబెట్టాడు. అవన్నీ ఎక్కడ దాచాలో అర్ధం కాక శిథిలావస్థలో ఉన్న ఇంట్లో దాచిపెట్టాడు. మూడు రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులకు.. షాకయ్యే విధంగా రూ.కోట్ల నగదు, నగలు బయటపడింది. అధ్వానస్థితిలో ఉన్న భవనం నుంచి కోట్ల రూపాయల నగదు, బంగారంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్‌లోని చోటుచేసుకుంది. సలియాసాహి బస్తీలో అధ్వాన స్థితిలో ఉన్న ఓ ఇంట్లో నుంచి రూ.1.42 కోట్ల నగదు, బంగారు నగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. గంజాం జిల్లా భంజనగర్‌ మైనర్‌ ఇరిగేషన్‌ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీరు (ఏఈ) గా కార్తికేశ్వర్ రౌల్‌ పనిచేస్తున్నాడు. అతనిపై అక్రమార్జన ఆరోపణలుడటంతో అధికారులు దాడులు నిర్వహించారు. 3 రోజులుగా సోదాలు చేస్తుండగా.. కార్తికేశ్వర రెండో భార్య కల్పనను విచారించారు. అయితే.. ఆమె సోదరి సలియాసాహి బస్తీలో ఓ కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నట్లు చెప్పింది. ఆమె చెప్పిన వివరాలతో శనివారం సోదరి నివసించే ఇంట్లో సోదాలు నిర్వహించారు.

అధ్వాన స్థితిలో ఉన్న ఇంటి నుంచి రూ.1.42 కోట్ల నగదుతో పాటు 345 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కార్తీకేశ్వర్ నుంచి మొత్తం రూ.4.76 కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తిని గుర్తించినట్లు ఒడిశా విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. గతంలో కూడా కార్తికేశ్వర్ రౌల్‌‌పై ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. అసిస్టెంట్ ఇంజనీర్ అక్రమ ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడటం ప్రస్తుతం భువనేశ్వర్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

AC In Cabs: ఏసీ వేస్తే ఒకరేటు.. లేకపోతే ఇంకోరేటు.. ఎండల్లో ప్రయాణికులకు షాకిస్తున్న క్యాబ్ డ్రైవర్లు

KTR on Amit Shah: టీఆర్ఎస్-బీజేపీల ట్విట్టర్ వార్.. కేంద్రం విధానాలపై అమిత్ షాను టార్గెట్ చేసిన కేటీఆర్

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ