Horse in Train: లోకల్ రైలులో గుర్రంతో ప్రయాణం.. ఆర్పీఎఫ్ సిబ్బందికి చుక్కలు.. చివరికి ఏం జరిగిందంటే?
Viral News: ప్రయాణికులతో నిండుగా ఉన్న ఓ రైలు కంపార్ట్‌మెంటులో గుర్రాన్ని తోలుకుని వచ్చాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Horse travel in Train: రద్దీగా ఉండే రైలులో ప్రయాణం అంటే అషామాషీ కాదు. అడుగుతీసి అడుగుపెట్టేందుకు జాగా ఉండదు. అలాంటిది ప్రయాణికులతో నిండుగా ఉన్న ఓ రైలు కంపార్ట్‌మెంటు(Rail comportment)లో గుర్రాన్ని తోలుకుని వచ్చాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే ఇప్పుడు గుర్రం యజమానికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. రైల్వే చట్టం(Railway Act) కింద గుర్రపు యజమానిని ఆర్పీఎఫ్ సిబ్బంది కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు.
నెటిజన్ల నివేదికల ప్రకారం ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా డైమండ్ హార్బర్ డౌన్ లోకల్ రైలులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గఫూర్ అలీ ముల్లా (40) అనే వ్యక్తికి చెందిన గుర్రం అలసిపోయే రేసులో పాల్గొంది. ఆ తర్వాత ముల్లా తన గుర్రాన్ని దక్షిణ్ దుర్గాపూర్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేత్రకు రైలులో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సియాల్దాకు దక్షిణాన ఉన్న డైమండ్ హార్బర్ ప్రాంతంలో గుర్రాన్ని రైలెక్కించారు. సియాల్దా డైమండ్ హార్బర్ లోకల్ రైలులో గుర్రం కూడా మనుషుల మధ్య నిలబడి ఉండటం ఫోటోలో కనిపిస్తోంది. ఈ ఫోటో వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఘటనపై నిజానిజాలను తెలుసుకునేందుకు రైల్వే పోలీస్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించింది. అసలు రైల్వే ప్లాట్‌ఫామ్‌లోకి గుర్రాన్ని ఎలా అనుమతించారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
#VIRAL_PICTURE Horse in Local Train Viral|| ব্যস্ত সময়ে ভিড় ট্রেনের কামরায় সওয়ারি বিরাট ঘোড়া! মুহূর্তে ভাইরাল ছবি… https://t.co/3m1vthEwfW
— Abir Ghoshal (@abirghoshal) April 7, 2022
ఈఎంయూ లోకల్ రైలులోని వెండర్ కంపార్ట్‌మెంట్‌లో గుర్రం ప్రయాణికుల మధ్య నిలబడి ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆర్‌పిఎఫ్ అధికారులు నేత్ర ప్రాంతంలో గుర్రం యజమానిని గుర్తించి స్థానిక పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. ఈస్టర్న్ రైల్వే ప్రతినిధి ఏకలవ్య చక్రవర్తి మాట్లాడుతూ, “రైల్వే ఆస్తిలో తెలివితక్కువ చర్యలకు పాల్పడినందుకు, రైలులో అనధికారికంగా స్థలాన్ని ఆక్రమించినందుకు అతనిపై రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము.” అని పేర్కొన్నారు. ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో జంతువులు ప్రయాణించలేవని, దాని కోసం ప్రత్యేక కంపార్ట్‌మెంట్ బుక్ చేసుకోవాలని చక్రవర్తి చెప్పారు. కోచ్‌లలో మహిళల భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపే సమయంలో ఈ 40 ఏళ్ల వ్యక్తి, అతని గుర్రం సాయంత్రం రైలు ఎక్కినట్లు ఆయన చెప్పారు.
Read Also…. Viral Video: పెట్రోధరల ఎఫెక్ట్ ప్రియా నిను కలవలేను అంటూ ప్రియుడి ఆవేదన.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో