- Telugu News Photo Gallery Fashion Tips in Telugu wearing jeans in summer is not comfortable, so try these stylish pants
Fashion Tips: సమ్మర్‌లో టైట్ జీన్స్ అసౌకర్యంగా ఉంటుందా? ఐతే ఈ స్టైలిష్ ప్యాంట్ల వైపు ఓ లుక్కేయండి..
వేసవిలో టైట్ జీన్స్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. జీన్స్‌కు బదులుగా ఈ సీజన్‌లో స్టైలిష్ లుక్‌లో, సౌకర్యవంతంగా ఉండే కొన్ని వెరైటీ ఫ్యాంట్లు మీకోసం..
Updated on: Apr 10, 2022 | 1:01 PM

Best Trendy pants in Summer: వేసవిలో టైట్ జీన్స్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. జీన్స్‌కు బదులుగా ఈ సీజన్‌లో స్టైలిష్ లుక్‌లో, సౌకర్యవంతంగా ఉండే కొన్ని వెరైటీ ఫ్యాంట్లు మీకోసం..

పలాజో ప్యాంట్ (Palazo Pants).. వేసవిలో పలాజో ప్యాంట్లు చాలా ట్రెండీగా, సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని టీ-షర్టులు, క్రాప్ టాప్‌లు, కుర్తీలతో కూడా ధరించొచ్చు. వీటిని ధరించి ఆఫీసు లేదా కాలేజీలకు వెళ్లొచ్చు. వేసవిలో ఇవి మంచి ఎంపిక.

ప్రింటెడ్ ప్యాంట్ (Printed Pants).. ప్రింటెడ్ ప్యాంట్ ఫ్యాషన్ మళ్లీ వచ్చేసింది. సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా స్టైలిష్ లుక్ వస్తుంది

వైడ్ లెగ్ ట్రౌజర్స్ (Wide Leg Trousers).. ఆఫీసులకు వెళ్లేవారికి వైడ్ లెగ్ ట్రౌజర్స్ మంచి ఎంపిక. ప్రస్తుతం ఇదే ట్రెండ్. స్టైలిష్ టాప్ లేదా క్రాప్ టాప్‌లతో వీటిని ధరించొచ్చు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉండటమేకాకుండా, కూల్ లుక్ ఇస్తుంది.

కాటన్ ప్యాంట్ (Cotton Pants).. వేసవిలో కాటన్ ఫ్యాబ్రిక్ ధరించడం మనలో చాలా మందికి ఇష్టం. ఇవి తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని పొట్టి కుర్తీ లేదా టాప్‌లతో ధరించొచ్చు. మార్కెట్లో అనేక డిజైన్లలో కాటన్ ప్యాంట్లు అందుబాటులో ఉన్నాయి.




