పెళ్లి ఊరేగింపు.. గుర్రంపై ఉండగానే గుండెపోటుతో వరుడు మృతి!
మరి కొద్ది కణాల్లో పెళ్లి తంతు. అప్పటికే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వరుడు గుర్రంపై జామ్ జామ్ అని వస్తున్నాడు. కానీ, అంతలోనే మృత్యువు అతని కలల్ని ముక్కలు చేసింది. ఈ విషాధ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

గుండెపోటు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సంభవిస్తోంది. మరీ ఎక్కువగా కరోనా కాలం తర్వాత ఈ గుండెపోటు మరణాలు నమోదు అవుతున్నాయి. తాజాగా పెళ్లి ఊరేగింపులోనే వరుడు గుండెపోటుతో మరణించిన విషాధ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఒక వరుడు తన వివాహ ఊరేగింపులో గుర్రంపై స్వారీ చేస్తుండగా గుండెపోటుతో మరణించాడు. శుక్రవారం రాత్రి షియోపూర్ పట్టణంలో 26 ఏళ్ల ప్రదీప్ జాట్, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గుర్రంపై వివాహ వేదికకు వెళుతుండగా ఈ విషాద సంఘటన జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో జాట్ సాంప్రదాయ వివాహ దుస్తులలో ప్రదీప్ వేదిక వద్దకు వస్తున్నట్లు చూడొచ్చు. కొద్దిసేపటి తర్వాత, అతను ముందుకు వంగి స్పృహ కోల్పోయాడు. ఒక బంధువు అతనికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాడు, కానీ అంతలోనే అతను కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో ఎంతో సంతోషంగా ఉన్న ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. తనకు కాబోయేవాడు గుర్రంపై వచ్చిన తనను పెళ్లాడతాడని కలలు కన్న ఆ వధువు కోరికలు కన్నీళ్లుగా మారాయి. గుర్రంపై రాజులా రావాల్సిన వాడు ఆస్పత్రిలో విగతజీవిగా పడిఉన్నాడు.
मध्यप्रदेश: श्योपुर जिले में एक हैरान कर देने वाली घटना सामने आई। शादी के दौरान घोड़ी पर सवार एक दूल्हे की मौत हो गई मौत से पहले दूल्हे ने बरातियों के साथ जमकर डांस भी किया दुल्हन स्टेज पर दूल्हे का इंतजार करती रही लेकिन दूल्हे के आने से पहले उसकी मौत की खबर आ गई।#heartattack pic.twitter.com/SvIA4tq7Fd
— Raajeev Chopra (@Raajeev_Chopra) February 15, 2025




