AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అదృశ్యం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..!

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలిక అదృశ్యమై హత్యకు గురైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన హల్దోని గ్రామంలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అదృశ్యం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు..!
Child Missing Greater Noida
Balaraju Goud
|

Updated on: Aug 29, 2026 | 3:48 PM

Share

గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆరేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. హల్దోని గ్రామం నుంచి అదృశ్యమైన చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 28న ఇంటి నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఎకోటెక్-3 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు ఓ సంచిని తీసుకెళ్తున్నట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహం స్వాధీనం

దర్యాప్తులో భాగంగా బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహిస్తుండగా.. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు చేసిన్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించింది. పోలీసులు నేరం జరిగిన తీరుపై కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు

బాలిక హత్యకు గల కారణాలు, ఘటన జరిగిన విధానం, నిందితుడి పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం జరిగిందా అనే కోణంతో పాటు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ నోయిడా డీసీపీ శైలేంద్ర సింగ్ వెల్లడించారు. ఆరేళ్ల బాలిక హత్యతో హల్దోని గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్య వెనుక అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us