Krishna Vamsi: వరుసగా రిజెక్షన్స్.. డౌన్ ఫాల్ అయినప్పుడు నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఆయనే.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్‌లో ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొన్నప్పుడు, తలుపులన్నీ మూసుకుపోయాయని భావించిన సమయంలో ఆ ఇద్దరు హీరోల నుంచి అపూర్వ మద్దతు లభించినట్లు భావోద్వేగంగా వెల్లడించారు. "ఒక డ్రాస్టిక్ ఇన్సిడెంట్" తర్వాత తన జీవితంలో రిజెక్షన్ మొదలైందని, ఏం చేయాలో పాలుపోని స్థితిలో చిరంజీవి పేరు గుర్తొచ్చిందని ఆయన తెలిపారు.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన కెరీర్‌లో ఒక అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొన్నప్పుడు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల నుంచి లభించిన అపూర్వ మద్దతును భావోద్వేగంగా పంచుకున్నారు. కెరీర్ బిగినింగ్ నుంచీ ఎన్నో వెన్నుపోట్లు, మోసాలు చూశానని, అయితే ఒక డ్రాస్టిక్ ఇన్సిడెంట్ తర్వాత రిజెక్షన్ మొదలైందని, అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో “అన్నయ్య” చిరంజీవి పేరు మాత్రమే గుర్తొచ్చిందని కృష్ణవంశీ పేర్కొన్నారు. అయితే, అప్పుడు చిరంజీవికి సరిపడే సబ్జెక్టు తన వద్ద లేదని, గతంలో చరణ్‌తో ఒక సినిమా అనుకున్నప్పుడు చిరంజీవి నువ్వు బాగా ఫ్యామిలీ సినిమాలు తీస్తావు కదా, చరణ్‌తో మంచి ఫ్యామిలీ సబ్జెక్టు ఉంటే చెప్పు అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయని ఆయన వివరించారు. ఈసారి చరణ్‌ని కలవాలని నిర్ణయించుకుని, “కబురు పంపించాను. ఒకసారి మీట్ అవుదాం అంటున్నాడు, చరణ్” అని చెప్పించగా, అరగంటలోనే తన మేనేజర్ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. “ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు? నేను ఫ్రీయే, ఎప్పుడైనా ఓకే” అని చరణ్ చెప్పడంతో ఆశ్చర్యపోయానని కృష్ణవంశీ అన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, సాంగ్ రెయిన్ సీక్వెన్స్‌లో చిత్రీకరణలో ఉన్న చరణ్‌ను కలవడానికి వెళ్ళానని చెప్పారు. తాను వెళ్ళగానే లేచి స్వాగతించిన చరణ్, మేకప్ రూమ్‌లోని తన హై చైర్ దిగి వచ్చి, విజిటర్స్ కోసం ఉన్న కింద చైర్‌లో తన పక్కనే కూర్చోవడం చూసి ఆయన నిరాడంబరతకు ముగ్ధుడనయ్యానని వంశీ పేర్కొన్నారు. తన వద్ద పూర్తి స్క్రిప్ట్ లేకపోయినా, ఒక ఐడియాని 15-20 నిమిషాలు నరేట్ చేయగా, “నీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు నాతో పని చేయడానికి?” అని చరణ్ అడగడం తనను మరింత ఆశ్చర్యపరిచిందని అన్నారు.
తొలుత మేనేజర్ “నెక్స్ట్ వీక్” అనబోగా, చరణ్ భార్య “ఎల్లుండి సండే ఫ్రీ కదా, మార్నింగ్ 10:30కి రమ్మనండి” అని సూచించడంతో, 10:30కి మళ్ళీ వెళ్ళి కథ చెప్పానని కృష్ణవంశీ తెలిపారు. చరణ్ ఆ కథ విని, “మూమెంట్స్ బాగున్నాయి సార్, బాగుంది. మనం చేసేద్దాం, అప్పాకి ఎప్పుడు చెప్తారు?” అని అడిగారని అన్నారు. ఇది తనలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు చిరంజీవి గారిని కలుసుకోగా, పొద్దున 8:00 గంటలకే ఆయన ఎదురుచూస్తూ ఉన్నారని, తాను చెప్పేదేమీ వినకుండా పక్కన ఉన్న న్యూస్ పేపర్‌ని పక్కన పెట్టి, సరస్వతి దేవిపై ఒట్టు వేసి “నువ్వు ఏం చెప్పావో నాకు తెలీదు, వాడు ఏమన్నాడో నాకు తెలీదు. కానీ మనం ఈ సినిమా చేస్తున్నాం. నువ్వు ఒక డేట్ ఫిక్స్ అయిపోయి ఎప్పుడు చెప్పాలో చెప్పు” అని ప్రకటించారని కృష్ణవంశీ గుర్తుచేసుకున్నారు. అలాంటి పరిస్థితులలో, ఆ ఒక్క మాట తనకు ఎంత బూస్ట్ ఇచ్చిందో చెప్పలేనని, అందుకే అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
అయితే, చరణ్‌కు ఒక సావనీర్ లాంటి సినిమా ఇవ్వలేకపోయాననే గిల్ట్ తనకు ఉందని, 100% మెమరబుల్ సినిమా ఇస్తానని కృష్ణవంశీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో పైసా సినిమా విషయంలో జరిగిన జాప్యాన్ని కూడా వివరించారు. పైసా షూటింగ్ ప్రారంభమయ్యేలోపే 3-4 నెలల గ్యాప్ వచ్చిందని, ఈలోగా నాని గౌతమ్ మీనన్ ప్రాజెక్టులోకి, సముద్రఖని జెండాపై కపిరాజుతో పాటు బాండ్ బాజా బారత్ వంటి చిత్రాల్లో బిజీ అయ్యారని ఆయన తెలిపారు.
