నోయిడా ఫ్యామిలీ డెత్ కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన సృష్టిస్తున్న వాయిస్ నోట్!
గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. తొలుత ఫుడ్ పాయిజన్ కారణంగా మరణాలు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే, పోస్టుమార్టం పరీక్షల్లో విషప్రయోగానికి సంబంధించిన సంకేతాలు కనిపించడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.

గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. తొలుత ఫుడ్ పాయిజన్ కారణంగా మరణాలు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే, పోస్టుమార్టం పరీక్షల్లో విషప్రయోగానికి సంబంధించిన సంకేతాలు కనిపించడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు, కుటుంబంలో చాలాకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మృతుడు చేసినట్లు చెబుతున్న వాయిస్ నోట్ కీలకంగా మారింది.
ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాలోని నాగ్లా శ్రీపదం గ్రామంలో శనివారం (అక్టోబర్ 17) మహేష్, ఆయన భార్య లలిత, వారి ముగ్గురు పిల్లలు ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
కుటుంబ సభ్యులు అంతకుముందు రాత్రి టీ, నూడుల్స్ తిన్నట్లు తెలియడంతో మొదట ఆహారంలో విషప్రయోగం కారణమై ఉండవచ్చని అనుమానించారు. అయితే, పోస్టుమార్టం పరీక్షల్లో ఫుడ్ పాయిజన్కు సంబంధించిన సంకేతాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మరణించిన ఐదుగురి అంతర్గత అవయవాల నమూనాలను భద్రపరిచి, ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం స్పష్టమవుతుంది.
వాయిస్ నోట్తో కొత్త మలుపు
ఈ కేసు దర్యాప్తులో మహేష్ మరణానికి ముందు తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసినట్లు చెబుతున్న వాయిస్ నోట్ కీలకంగా మారింది. అందులో తన కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇద్దరు సోదరీమణులు సునీత, సప్న, బావ శేఖర్ కారణమని మహేష్ ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదం నేపథ్యంలో వేధింపులు ఎదుర్కొన్నారని కుటుంబసభ్యులు ఫిర్యాదులోనూ పేర్కొన్నారు.
आज दिनांक 17.10.2026 को प्रातः थाना रबूपुरा पर सूचना प्राप्त हुई कि ग्राम नगला श्री पदम निवासी एक ही परिवार के 05 सदस्य जिसमें पति-पत्नी व उनके 03 बच्चों की मृत्यु हो गई है। सूचना प्राप्त होते ही स्थानीय पुलिस बल, उच्चाधिकारीगण, एम्बुलेंस एवं फूड व सेफ्टी विभाग की टीम तत्काल मौके पर पहुँचे। फील्ड यूनिट, फोरेंसिक टीम द्वारा घटनास्थल का गहन निरीक्षण कर वैज्ञानिक साक्ष्य संकलित किए जा रहे हैं। मृतकों के शव का पंचायतनामा भरकर पोस्टमार्टम हेतु भेजा गया है।
प्रथम दृष्टया मामला ‘फूड पॉइजनिंग’ का होना पाया जा रहा है। खाद्य एवं फूड सेफ्टी विभाग द्वारा सैंपल लेकर आवश्यक परीक्षण किए जा रहे है। पोस्टमार्टम रिपोर्ट एवं अन्य वैज्ञानिक जांच के आधार पर अग्रिम विधिक कार्रवाई सुनिश्चित की जा रही है। उक्त के संबंध में @DCPGreaterNoida द्वारा दी गई बाइट।
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) October 17, 2026
ముగ్గురు బంధువుల అరెస్ట్
మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సునీత, సప్న, శేఖర్లపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరణాల్లో వారి పాత్ర ఏమిటన్నది అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆస్తి వివాదం, వాయిస్ నోట్, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, విషప్రయోగం జరిగిందా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. అంతర్గత అవయవాల ప్రయోగశాల నివేదికలు, ఇతర ఆధారాలు అందిన తర్వాతే ఐదుగురి మరణాలకు దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
