Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి మీ నడుము పసిడిగానూ.. భలే ప్లాన్ చేశార్రా బత్తాయిలు.. కానీ..!

ఢిల్లీలో భారీ అక్రమ రవాణా గుట్టురట్టైంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 7 కోట్ల 80 లక్షలు విలువ గల 10 కిలోల స్వచ్ఛమైన బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు.

ఓరి మీ నడుము పసిడిగానూ.. భలే ప్లాన్ చేశార్రా బత్తాయిలు.. కానీ..!
10kg Gold Seized
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 06, 2025 | 11:58 AM

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ బంగారం అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. ఇందుకు సంబంధించి ఇద్దరు విమాన ప్రయాణికులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల స్వచ్ఛమైన బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు.

ఇటలీలోని మిలాన్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గర ఈ బంగారాన్ని గుర్తించారు. వాళ్ల బ్యాగ్‌లు స్కాన్ చేసినప్పుడు గోల్డ్‌ లాంటివేమీ స్కానర్‌లో కనిపించలేదు. అయితే.. వీళ్లు కాస్త అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వాళ్లను చెక్ చేస్తే.. ప్రత్యేక బెల్ట్‌ రూపంలో గోల్డ్‌ కాయిన్స్‌ తెచ్చినట్టు గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గర 5 కేజీల చొప్పున 10 కేజీల బంగారం ఉంది. వాటి విలువ 7 కోట్ల 80 లక్షలు రూపాయలు ఉంటుందని కస్టమ్ అధికారులు చెప్తున్నారు. నిందితులు ఇద్దరూ కశ్మీర్‌కు చెందిన వారిగా గుర్తించారు. మిలాన్ నుండి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు కస్టమ్ అధికారులు తెలిపారు.

కస్టమ్స్ ప్రతినిధి నుండి అందిన సమాచారం ప్రకారం, జనవరి 5న మిలన్ నుండి ఎయిర్ ఇండియా విమానం నంబర్ AI-138 ద్వారా IGI విమానాశ్రయ టెర్మినల్ 3కి చేరుకున్న ఇద్దరు విమాన ప్రయాణికులను రూట్ ప్రొఫైలింగ్, అనుమానం ఆధారంగా గ్రీన్ ఛానల్‌కు చేరుకున్నారు. వారి లగేజీని స్క్రీనింగ్ చేయగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కానీ అతను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ గుండా వెళ్ళినప్పుడు హెచ్చరిక శబ్దం వినిపించింది. దీంతో వారిని పూర్తిగా వ్యక్తిగత తనిఖీ చేశారు. వారి నడుము చుట్టూ ధరించే రెండు ప్రత్యేక రకాల బెల్టుల గురించి కస్టమ్స్ అధికారులకు తెలిసింది. వాటిలో ప్లాస్టిక్ కవరులో దాచిన స్వచ్ఛమైన బంగారు నాణేలు బయటపడ్డాయి.

స్వాధీనం చేసుకున్న బంగారు నాణేల మొత్తం బరువు 10 కిలోల 92 గ్రాములు, దీని విలువ రూ.7 కోట్ల 80 లక్షలు. కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకున్న బంగారు నాణేలను కస్టమ్స్ చట్టం 1962లోని సెక్షన్ 110 కింద కేసు నమోదు చేశారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద నిందితులైన విమాన ప్రయాణికులిద్దరినీ అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..