అద్భుత ఫీచర్లతో రైల్వే సూపర్ యాప్.. అన్ని సేవలూ అందులోనే
రైళ్లకు సంబంధించిన అన్ని సేవలూ ఒకేచోట అందించే ఓ సూపర్ యాప్‌ను భారతీయ రైల్వే తాజాగా అందుబాటులోకి తెచ్చింది. స్వరైల్ పేరిట దీన్ని లాంచ్ చేసింది. అయితే, దీన్ని అందరూ ఉపయోగించలేరు. ఎందుకంటే ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. పరిమిత సంఖ్యలో యూజర్లు మాత్రమే వాడేందుకు వీలుంటుంది.
కాబట్టి అందరూ దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై వెయ్యి మందికి తొలుత రైల్వేశాఖ ఈ అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటికే బీటా టెస్టింగ్ ఎంచుకున్న వారి సంఖ్య పూర్తయ్యిందని ఈ యాప్‌ను రూపొందించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిపింది. బీటా టెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు, చేర్పులతో పౌరులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. అంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. బీటా టెస్టర్ల సంఖ్యను మున్ముందు పెంచితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ యాప్ ఫీచర్ల విషయానికి వస్తే.. రిజర్వ్ టికెట్లతో పాటు, అన్‌రిజర్వుడు టికెట్లను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై బుక్ చేసుకోవచ్చు. పార్సిల్, సరకు రవాణా వంటి సేవలనూ పొందొచ్చు. పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేయడంతో పాటు, రైల్లోకి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. రైల్వేకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే వాటినీ ఇందులోనే పొందుపరిచే వీలుంటుంది. ప్రస్తుతానికి ఈ సేవలన్నీ ఆన్‌లైన్‌లో, యాప్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో సేవకు ఒక్కో యాప్ ఉంది. వీటన్నింటినీ ఒకేచోట అందించడమే ఈ సూపర్ యాప్ లక్ష్యం. మున్ముందు మరిన్ని సేవలను ఇందులో జోడించే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: ఎట్టకేలకు OTTలోకి గేమ్ ఛేంజర్..
రియల్ తండేల్ రాజు ఇతనే.. కథ వింటే కన్నీళ్లాగవు
అవును.. అలా పెట్టడం నా తప్పేనండీ.. క్షమించండి..
సినిమా సెట్ లోకి గ్రాండ్ వెల్ కం.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న జానీ

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
