AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: తనపై అత్యాచారం చేసిన వాడే చెల్లినీ వేధించాడు.. విషయం తెలుసుకున్న అక్క ఏం చేసిందంటే

చదువుకునే రోజుల్లో ఓ ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి (Rape) గురైంది ఓ బాలిక. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు బాలికపై మరోసారి...

Crime news: తనపై అత్యాచారం చేసిన వాడే చెల్లినీ వేధించాడు.. విషయం తెలుసుకున్న అక్క ఏం చేసిందంటే
Student Harassment
Ganesh Mudavath
|

Updated on: Mar 15, 2022 | 3:25 PM

Share

చదువుకునే రోజుల్లో ఓ ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి (Rape) గురైంది ఓ బాలిక. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక.. చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ సంచలన విషయం తెలిసింది. తనపై అత్యాచారం చేసిన వాడే తన సోదరిని లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసి తీవ్ర కోపంతో రగిలిపోయింది. వెంటనే తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్(Rajasthan)​ నాగౌర్​ జిల్లాకు చెందిన ఓ బాలిక 2018లో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హరిరామ్​అనే వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైంది. ఖాళీగా ఉన్న ఓ తరగతి గదిలో బాలికను తీసుకెళ్లి అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. పదో తరగతి చదివే సమయంలోనూ మరోసారి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి తీవ్ర భయాందోళనకు గురైన బాధిత బాలిక..మానసిక క్షోభను అనుభవిస్తూ ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో.. ఈ ఏడాది మార్చి 5న అదే ఉపాధ్యాయుడు బాధితురాలి సోదరిని లైంగికంగా వేధించాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన బాలిక.. గతంలో తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. బంధువులతో కలిసి నాగౌర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also  Read

AP Politics: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతేనా? సీఎం నిఘాలో ఉన్నదెవరు?

ఆమ్నా షరీఫ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

IPL 2022: ఐపీఎల్ టీమ్స్ కు అలెర్ట్.. కొత్త నిబంధనలు ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే..

Follow Us
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..