కాగ్‌ చీఫ్‌గా ముర్మును నియమిస్తూ ఉత్తర్వులు

భారత కంప్ట్రోలర్‌ అండ్ అడిటర్ జనరల్ (CAG‌) గా గిరీష్ చంద్ర ముర్మును నియమించింది ప్రభుత్వం. బుధవారం వరకు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు..

కాగ్‌ చీఫ్‌గా ముర్మును నియమిస్తూ ఉత్తర్వులు

భారత కంప్ట్రోలర్‌ అండ్ అడిటర్ జనరల్ (CAG‌) గా గిరీష్ చంద్ర ముర్మును నియమించింది ప్రభుత్వం. బుధవారం వరకు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. బుధవారం రాత్రి ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించారు. ముర్ము స్థానంలో కొత్తగా మనోజ్ సిన్హాను జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. అయితే లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాజీనామా చేసిన ముర్మును.. CAG చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రజత్ కుమార్ మిశ్రా పేరుతో ఈ నోటిఫికేషన్ జారీ అయింది. కంప్ట్రోలర్‌ అండ్ అడిటర్ జనరల్‌ ఆఫ్ ఇండియాగా (CAG) గిరిష్ చంద్ర ముర్మును నియమిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ప్రస్తుత కాగ్ చీఫ్ రాజీవ్ మెహరిషీ పదవీకాలం శనివారం నాడు ముగుస్తుంది. అదే రోజు. జీసీ ముర్ము.. కాగ్‌ చీఫ్‌గా రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu