బ్రేకింగ్.. రాజస్థాన్‌లో భూకంపం
ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే గత రెండు మూడు నెలలుగా అనేక ప్రాంతాల్లో వరుస భూకంపాలు ప్రజల్ని..
ఓ వైపు యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే గత రెండు మూడు నెలలుగా అనేక ప్రాంతాల్లో వరుస భూకంపాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు.. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్,ఆఫ్ఘన్, కజకిస్థాన్ సరిహద్దుల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా శుక్రవారం తెల్లవారు జామున 12.44 గంటలకు రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. జైపూర్‌కు ఉత్తరం దిక్కున 82 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
An earthquake of magnitude 3.1, occurred 82 km north of Jaipur in Rajasthan, at 12:44 am today: National Center for Seismology (NCS)
— ANI (@ANI) August 6, 2020
Read More :