అప్పట్లో ఈ భారతీయ నగరాలను ఏమని పిలిచేవారు.? 

TV9 Telugu

28 December 2024

నవాబుల పాలన సమయంలో భాగ్యనగర్ ఉన్న నగరం కాలక్రమేణా హైదరాబాద్ అయింది. ఇది తెలంగాణ రాష్ట్రం రాజదానిగా ఉంది.

తెలంగాణాలో వరంగల్ నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది కాకతీయుల రాజదాని. అప్పట్లో ఓరుగల్లు అనే పేరుతో పిలిచేవారు.

కోజికోడ్ కేరళలో ఒక నగరం. పోలాండ్ పాలకులు జామోరిన్స్ కాలంలో ప్రజలు ఈ ప్రదేశాన్ని కాలికట్‎గా సంబోదించేవారు.

కర్ణాటకలోని ప్రముఖ నగరాల్లో బీదర్ ఒకటి. బహమనీ సుల్తానుల పాలనలో ఈ నగరాన్ని మహమ్మదాబాద్ అని పిలిచేవారు.

తమిళనాడు రాజధాని చెన్నైని ప్రత్యేక తమిళ రాష్ట్రంగా ఏర్పడానికి ముందు మద్రాసు అని పిలిచేవారు. తర్వాత పేరు మారింది.

బీహార్ రాజధానిగా ఉన్న పాట్నా పేరు కూడా మార్చబడిందని చాల తక్కువ మందికి తెలుసు. పురాణాల్లో ఉన్న పాటలీపుత్ర ఇదే.

అస్సాం రాజధాని గౌహతి నగరాన్ని మహాభారతకాలంలో ప్రాగ్జ్యోతిష్‌పురా అనే పిలిచేవారు. కాళికా పురాణంలో ఇది ఉంది.

అలహాబాద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆధ్యాత్మిక నగరం. అనేక హిందూ పురాణాల్లో ప్రస్తావించే ప్రయాగ ఇదే.