ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావి ఎక్కడ ఉంది?
TV9 Telugu
27 December
2024
అయిల్ లేకపోతే ఎన్ని పనులు ఆగిపోతాయో ఊహించండి. చమురు చాలా దేశాలకు అలాంటి శక్తిని ఇచ్చింది. అది వాటిని సంపన్న దేశాల జాబితాలో చేర్చింది.
సౌదీ నుండి ఖతార్ వరకు చమురు ఆధిపత్య దేశాల జాబితాలో ఉంటాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావి అజర్‌బైజాన్ రాజధాని బాకులో వెలుగులోకి వచ్చింది.
ఈ చమురు బావిని 19వ శతాబ్దంలో 1846లో తవ్వారు. పెట్రోలియం నాఫ్తా హైడ్రోకార్బన్ ద్రవాన్ని తయారు చేయడానికి ఈ బావిని ఉపయోగించారు.
1899 వరకు అజర్‌బైజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి, ప్రాసెసింగ్ కలిగిన దేశం. 1899లో ప్రపంచంలోని చమురులో సగం ఈ దేశం ఉత్పత్తి చేసిందే..!
అజర్‌బైజాన్ దేశం 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ప్రపంచ చమురు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారింది.
అజర్‌బైజాన్‌లోని పెట్రోలియం పరిశ్రమ 2022లో దాదాపు 33 మిలియన్ టన్నుల చమురు, 35 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా.
స్టేట్ ఆయిల్ కంపెనీ ఆఫ్ అజర్‌బైజాన్ (SOCAR) అజర్‌బైజాన్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. 4 లక్షల 82 వేల బ్యారెళ్ల ముడి చమురు కూడా ఉత్పత్తి అవుతుంది.
మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ ప్రకారం, మార్చి 2024లో దేశంలో రోజుకు 5 లక్షల 96 వేల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయడం జరుగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
సైకాలజీ నేర్చుకుంటున్నారా.? ఉత్తమ పుస్తకాలు ఇవే..
ఒరిస్సాకి ఆ పేరు ఎలా వచ్చింది.?
ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూడవచ్చా..?