Gautam Adani – Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తకర పరిణామం.. శరద్‌పవార్‌తో అదానీ భేటీ..
మహారాష్ట్రలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ అదానీతో శరద్‌పవార్ సమావేశం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భేటీ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తుందా..? అసలు పవార్- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది..?
Gautam Adani meets Sharad Pawar: హిండెన్ బర్గ్ – అదానీ వివాదంపై విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న తరుణంలో బిలియనీర్ గౌతమ్ అదానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబైలో భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసానికి వెళ్లి అదానీ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు శరద్ పవార్, గౌతమ్ అదానీల సమావేశం కొనసాగింది. దీంతో ఈ భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని.. అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా.. ప్రభావవంతంగా ఉంటుందని శరద్ పవార్ ఇటీవల ప్రకటించారు.
ఈ క్రమంలోనే శరద్ పవార్ నివాసానికి అదానీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే.. బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. పవార్ మాత్రం సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ వైపు మొగ్గుచూపారు. ఈ పరిణామం శరద్ పవార్ తోటి ప్రతిపక్ష నాయకులను సైతం ఆశ్యర్యపరిచింది. అయితే.. అదానీ విషయంలో పవార్ మొదటి నుంచి మెతక వైఖరి ప్రదర్శిస్తుండడంపై పలు విమర్శలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..