Asad Ahmed Encounter: యూపీలోని ఝాన్సీలో ఎన్‌కౌంటర్.. మాఫియా డాన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అసద్ హతం..
అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, షూటర్ గులాం మహ్మద్‌లు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఇద్దరికీ తప్పించుకునే మార్గం లేని విధంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు పోలీసులు. డీఎస్పీ నావేందు, డీఎస్పీ విమల్ ఆధ్వర్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉమేష్‌పాల్ హత్య జరిగిన 48 రోజుల తర్వాత ఏప్రిల్ 13న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ హతమయ్యాడు.

యూపీ ఎస్టీఎఫ్ జరిపిన ఎన్‌కౌంటర్‌లో మాఫియా అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ హతమయ్యాడు. ఝాన్సీలో ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రమేయం ఉన్న అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, షూటర్ గులాం మహ్మద్‌లు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఇద్దరికీ తప్పించుకునే మార్గం లేని విధంగా ఈ ఆపరేషన్ పూర్తి చేశారు పోలీసులు. డీఎస్పీ నావేందు, డీఎస్పీ విమల్ ఆధ్వర్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉమేష్‌పాల్ హత్య జరిగిన 48 రోజుల తర్వాత ఏప్రిల్ 13న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ హతమయ్యాడు. అహ్మదాబాద్ లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు అతిఖ్‌ను తరలించిన రోజే అతడి కుమారుడు ఎన్‌కౌంటర్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో యూపీ ఎస్‌టీఎఫ్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ చనిపోయాడు. అసద్‌తో పాటు మరో షూటర్ గులాం అహ్మద్ కూడా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
సంఘటనా స్థలం నుంచి అధునాతన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు అసద్. ఉమేశ్‌పాల్ హత్య జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడు. యూపీ పోలీసులు అసద్‌పై 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో అతిఖ్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అసద్ ఎన్‌కౌంటర్ గురించి సమాచారాన్ని అతిఖ్ అహ్మద్‌కు చేరవేశారు పోలీసులు.
అతిఖ్ అహ్మద్‌ను వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం . గట్టి బందోబస్తు మధ్య అతిఖ్‌ను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. కోర్టులో అతిఖ్‌కు వ్యతిరేకంగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కోర్టులో కొందరు అతిఖ్ అహ్మదపై చెప్పులు విసిరారు.
2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్ గత ఫిభ్రవరి 27వ తేదీన హత్యకు గురయ్యాడు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉమేశ్‌పాల్ మర్డర్‌లో అతిఖ్ గ్యాంగ్ హస్తముందని యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.




