Gandhi Shanti Prize: గీతా ప్రెస్‌కి గాంధీ శాంతి పురస్కారం .. సావర్కర్ , గాడ్సేలకు అవార్డు ఇవ్వడం వంటిదన్న కాంగ్రెస్..
2021 ఏడాదికి గాను ఈ అవార్డు ను ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని జ్యూరీ సమావేశం అయింది. గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ను 2021 అవార్డుతో సత్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సంస్థ గాంధేయ పద్ధతులను అనుసరిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు విశిష్ట సహకారం అందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనుంది.
కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే గాంధీ శాంతి బహుమతిని 2021వ సంవత్సరానికి గాను గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్ కు ప్రదానం చేయనున్నారు. “అహింసా, ఇతర గాంధేయ పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం గీతా ప్రెస్ అందించిన విశిష్ట సహకారానికి” గుర్తింపుగా ఈ శాంతి బహుమతిని అందజేయనున్నామని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ గాంధీ శాంతి బహుమతిని 1995 లో కేంద్ర ప్రభుత్వం నుంచి పలువురు ప్రముఖులకు సంస్థలకు అందజేస్తుంది. గాంధీ చెప్పిన ఆదర్శాలకు నివాళిగా ఇస్తున్న వార్షిక అవార్డు. ఈ అవార్డును జాతీయత, జాతి, భాష, కులం, మతం లేదా లింగ బేధాలు లేకుండా అందరికీ అందిస్తారు. అవార్డు లో భాగంగా ఒక కోటి రూపాయల నగదును , ప్రశంసా పత్రం, ఫలకం, సున్నితమైన సాంప్రదాయ హస్తకళ లేదా చేనేత వస్తువును బహుమతి గ్రహీతలకు అందిస్తారు. ఇప్పటి వరకూ ఈ శాంతి బహుమతిని అందుకున్న గ్రహీతలలో ఇస్రో, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు ఉన్నాయి.
2021 ఏడాదికి గాను ఈ అవార్డు ను ఎంపిక చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని జ్యూరీ సమావేశం అయింది. గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ను 2021 అవార్డుతో సత్కరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సంస్థ గాంధేయ పద్ధతులను అనుసరిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తనకు విశిష్ట సహకారం అందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకోనుంది.
ఇదే విషయాన్నీ ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. గీతా ప్రెస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీ శాంతి బహుమతిని అందజేయడం ఆ సంస్థ చేస్తున్న సామాజిక కృషికి గుర్తింపుగా నిలుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
2021 గాంధీ శాంతి బహుమతిని అందుకోనున్న గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌ని ప్రధాని మోడీ అభినందించారు. గత 100 సంవత్సరాలుగా ప్రజలలో సామాజిక , సాంస్కృతిక పరివర్తనలను పెంపొందించడంలో ఈ సంస్థ ప్రశంసనీయమైన పని చేసారు” అని మోడీ ట్వీట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గీతా ప్రెస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
1923లో స్థాపించబడిన గీతా ప్రెస్ త్వరలో 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 162 మిలియన్ల శ్రీమద్ భగవద్గీతతో సహా 14 భాషలలో 417 మిలియన్ పుస్తకాలను ప్రచురించింది.
అయితే గీతా ప్రెస్‌కి బహుమతిని ప్రదానం చేయడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. ఈ అవార్డు ను గీత ప్రెస్ కు ఇవ్వడం “అపహస్యం” అని పేర్కొంది. ఈ నిర్ణయం నిజంగా హాస్యాస్పదంగా ఉంది.. సావర్కర్ , గాడ్సేలకు గాంధీ శాంతి అవార్డు ఇవ్వడం లాంటిది, ”అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..