AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధికారమే పరమావధి.. అయితే ..!

కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా ఫైనల్ అని ప్రకటించిన రాహుల్ గాంధీ.. నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘమైన లేఖను,, ట్వీట్లతో బాటు విడుదల చేశారు. దీన్ని తమ పార్టీ కార్యకర్తలకు రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ గా భావిస్తున్నారు. ఈ లేఖలో ఆయన.. ఈ దేశంలో అధికారం కోసం తహతహలాడుతున్నవారి వైఖరిని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. ‘ ఇండియాలో ఇదో అలవాటుగా మారింది. అదే ! అధికారాన్ని అంటిపెట్టుకున్నవారు దాన్ని […]

అధికారమే పరమావధి.. అయితే ..!
Pardhasaradhi Peri
|

Updated on: Jul 03, 2019 | 6:16 PM

Share

కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామా ఫైనల్ అని ప్రకటించిన రాహుల్ గాంధీ.. నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘమైన లేఖను,, ట్వీట్లతో బాటు విడుదల చేశారు. దీన్ని తమ పార్టీ కార్యకర్తలకు రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ గా భావిస్తున్నారు. ఈ లేఖలో ఆయన.. ఈ దేశంలో అధికారం కోసం తహతహలాడుతున్నవారి వైఖరిని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది. ‘ ఇండియాలో ఇదో అలవాటుగా మారింది. అదే ! అధికారాన్ని అంటిపెట్టుకున్నవారు దాన్ని వదలలేరు. అలాగే అధికారాభిలాష ఉంటే..దాన్ని పణంగా పెట్టకుండా ప్రత్యర్థులను ఓడించలేం. ఈ ఏడాదిలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఇన్నాళ్లూ పార్టీకి సేవలు చేయవలసి రావడం నాకు గౌరవప్రదమని భావిస్తున్నాను. పార్టీ విలువలు, సిధ్ధాంతాలు మన దేశానికి ఆయువు పట్టయ్యాయి. ఈ దేశానికి, నా పార్టీకి ఎంతో రుణపడి ఉంటాను. మన పార్టీకి జవాబుదారీ అన్నది ఇప్పుడే కాదు..భవిష్యత్తులో కూడా ఎంతో ముఖ్యం. అందుకే రాజీనామా చేశాను. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి పలువురిని జవాబుదారీని చేయాల్సి ఉంది. అయితే నా బాధ్యతను పక్కనబెట్టి ఇతరులను జవాబుదారీని చేయలేను. అది సముచితం కాదు కూడా. పార్టీ కొత్త నేతను ఎన్నుకోవాలని నా సహచరులు చాలామంది కోరారు. కానీ అది కరెక్ట్ కాదు. మన పార్టీకి ఎంతో చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరచి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చాలాసార్లు కోరాను ‘ అని రాహుల్ పేర్కొన్నారు. ఇక… బీజేపీ పట్ల నాకు ద్వేషం లేదు.. అయితే దేశం పట్ల వారి పోకడను నా దేహంలో ప్రతిభాగం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇది కొత్త పోరాటం కాదు.. వేలాది ఏళ్లుగా మనగడ్డపై కొనసాగుతోంది. ద్వేషం ఉన్న చోట నేను ప్రేమను పంచాను.. ఈ రోజు బీజేపీ ఒక పథకం ప్రకారం ప్రజల వాణిని నొక్కేస్తోంది. ఈ గొంతులను మనం మళ్ళీ ఉత్తేజపరచి ఏకం చేయాల్సి ఉంది. ఈ బాధ్యత పార్టీ పై ఉంది. ప్రధాని ఈ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. అది ఆయనపై వఛ్చిన అవినీతి ఆరోపణలు తప్పని నిరూపించజాలదు.. అధికారకాంక్ష ఇండియాలో ఊహించలేని  హింసకు కారణమవుతోంది. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గిరిజనులు, దళితులు, మైనార్టీలు ఎన్నో బాధలు పడాల్సి వస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ ప్రతిష్ఠ మసకబారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నా సేవలు నిరంతరం ఉంటాయి.. జై హింద్.. అంటూ రాహుల్ తన లేఖను ముగించారు.