
సినిమాల్లో క్లైమాక్స్ ముందే రాస్తారు. చేయడం, తీయడం ఈజీ. ఇది రాజకీయం కదా.. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంటుంది. ఒక్కో అడుగు యాంటీ క్లైమాక్స్‌గా మారినా ఆశ్చర్యం లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో సీఎం సీట్లో కూర్చుంటున్నారు విజయ్. అందులోనూ.. దేశంలోని మిగతా రాష్ట్రాలు వేరు, తమిళనాడు వేరు. అదొక సిద్ధాంతాల కోట. పెరియార్ వేసిన పునాది, అన్నాదురై కట్టిన గోడలు, కరుణానిధి-జయలలిత నడిపిన సామ్రాజ్యం. ఆ కోటలోకి చొచ్చుకెళ్లడం జాతీయ పార్టీలకే సాధ్యం కాలేదు. సాధారణ కానీ.. వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన జోసెఫ్ విజయ్, తమిళనాడు రాజకీయ పీఠంపై ‘అధిపతి’ కావాలని అడుగులు వేశారు. ‘విజయ్ అనే నేను’.. ఈ ఒక్క మాట అనడం కోసం ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని అడ్డంకులో కదా. విజయ్ రాజకీయ ప్రయాణం ఓవర్‌నైట్ జరిగింది కాదు. ఇది ఒక పక్కా ప్లానింగ్‌తో కూడిన లాంగ్ గేమ్. విజయ్ ఒకేసారి పొలిటికల్ స్క్రీన్ మీదకు రాలేదు. దశాబ్ద కాలంగా తన సినిమాల ద్వారా సిస్టమ్‌లోని లొసుగులను ప్రశ్నిస్తూనే వచ్చారు. తుపాకీ, కత్తి సినిమాలో సామాజిక సమస్యలపై ప్రశ్నించారు. మెర్సల్, సర్కార్‌లో.. నేరుగా ప్రభుత్వ విధానాలను, ఓటు విలువను ప్రశ్నించారు. సినిమాలే కదా లైట్ తీసుకున్నారంతా. కాని, అలాంటి సినిమాలతో జెన్-జీకి...