
ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి ఇంటికి కోటి రూపాయలు. ఒక్కసారి కాదు ప్రతి ఏటా కోటి రూపాయలు. ప్రతి ఇంటికి ఓ హెలికాప్టర్. కొత్త జంటకు బంగారు నగలు, మూడంతస్తుల బిల్డింగ్. ఆడవాళ్లకు వంటింటి పనిభారం తగ్గించేందుకు రోబోలు, కాల్వల్లో ఈదడానికి ప్రతి కుటుంబానికి ఓ పడవ. తమిళనాడు ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన ఓ జర్నలిస్ట్ ఇచ్చిన హామీలు ఇవి. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో.. హైదరాబాద్‌కు సముద్రాన్ని తెస్తానని హీరో ప్రామిస్ చేస్తే అంతా నవ్వుకున్నాం గానీ.. తమిళనాడులో నిజంగానే హామీలిచ్చాడు. ఇందులో.. ఎదుటివాళ్లు హామీలు ఇస్తున్నారు కదా అని ఓటు వేయొద్దని చెప్పడం ఒక ఉద్దేశం అయితే.. పార్టీల హామీలపై సెటైర్లు వేయడం మరో ఉద్దేశం. కలర్ టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా ఎన్ని హామీలు ఇచ్చారో తమిళనాడులో. ఆ రాష్ట్రం సంగతేమో గానీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల హామీలపై ఓ చర్చ అయితే జరుగుతోందిప్పుడు. కాంగ్రెస్ హామీలపై మోదీ చేసిన కామెంట్.. ‘కాస్త చూసుకుని హామీలు ఇవ్వండంటూ’ ఖర్గే చెప్పడం చూశాక.. ‘గ్యారెంటీ పే చర్చ’ నడుస్తోంది. గెలవడానికి హామీలు ఇవ్వడం, గెలిచాక చతికిలపడడం, ప్రజల్లో నమ్మకం కోల్పోవడం.. కొన్ని పార్టీలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది అసలు విషయం. ఇంతకీ.. మోదీ ఎందుకని పర్టిక్యులర్‌గా తెలంగాణ, కర్నాటకను ఎగ్జాంపుల్‌గా చూపించారు? ఖర్గే ఎందుకని జాగ్రత్తపడ్డారు? బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మరోసారి ఆలోచించుకుంటామని కర్నాటక ప్రభుత్వం ఎందుకంది? అసలు ఎలక్షన్ కమిషన్‌గానీ, సుప్రీంకోర్టు...