సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం కోసం వేట.. ఊపిరాడక నలుగురు కూలీలు మృతి.. ఎక్కడంటే..

అయితే ఊపిరాడక వారంతా స్పృహ కోల్పోయారు. కార్మికులు 10 అడుగుల లోతు గల సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగగానే విషపూరిత పొగలు వ్యాపించాయని తెలిసింది. దాంతో కార్మికులంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్మికులను ట్యాంక్ నుండి బయటకు తీసి మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.

సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం కోసం వేట.. ఊపిరాడక నలుగురు కూలీలు మృతి.. ఎక్కడంటే..
Suffocation In Septic Tank

Updated on: May 28, 2025 | 11:13 AM

డబ్బులు ఎక్కువగా వస్తాయనే ఆశతో సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగిన నలుగురు కూలీలు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మరణించారు.. అయితే, తొలుత ఆ పని చేయడానికి వారు నిరాకరించారని తెలిసింది. కానీ, కూలీ డబ్బులు అదనంగా ఎక్కువ ఇస్తామని గోల్డ్ షాపు యజమాని చెప్పడంతో ఆశతో కూలీలు ఈ పనికి ఒప్పుకున్నారని తెలిసింది. కానీ, చివరకు వారంతా అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు. జరిగిన సంఘటనలో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేపింది.

సీతాపుర పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలోని 10 అడుగుల సెప్టిక్ ట్యాంక్‌లోకి ముందుగా అమిత్, రోహిత్ సెప్టిక్ దిగారు. నిమిషాల్లోనే వారు స్పృహ కోల్పోవడం మొదలుపెట్టి సహాయం కోసం కేకలు వేశారు. వారిని కాపాడటానికి తోటి కార్మికులు సంజీవ్, హిమాన్షు, అర్పిత్, అజయ్, రాజ్ పాల్, ముఖేష్  ట్యాంక్ లోకి దిగారు. అయితే ఊపిరాడక వారంతా స్పృహ కోల్పోయారు. కార్మికులు 10 అడుగుల లోతు గల సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగగానే విషపూరిత పొగలు వ్యాపించాయని తెలిసింది. దాంతో కార్మికులంతా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్మికులను ట్యాంక్ నుండి బయటకు తీసి మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ నిష్క్రియాశీలతను విమర్శించారు. ఇటీవలి నెలల్లో బికనీర్, డీగ్, జైపూర్ అంతటా సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేస్తున్న క్రమంలో దాదాపు పది మంది పారిశుద్ధ్య కార్మికులు మరణించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని గెహ్లాట్ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..