AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gular Indian Fig: పురుగులున్నాయని ఈ పండును పడేస్తున్నారా..అయితే పెద్ద తప్పు చేసినట్లే.. లభాలు తెలిస్తే..

మేడిపండు.. ఈ పండు గురించి దాదాపు అందరికీ తెలుసు. ఎలాగంటే.. మేడిపండు చూడు..మేలమై ఉండును..పొట్ట విప్పి చూడు పురుగులుండును..అనే వేమన శతకం అందరూ చదివే ఉంటారు. ఈ పండు చూసేందుకు అచ్చం అంజీర పండులాగే ఉంటుంది. కానీ, మేడిపండును విప్పి తినకూడదు. ఎందుకంటే మేడిపండులో పురుగులు ఉంటాయి. కానీ, మేడిపండును ఒక సూపర్ ఫుడ్ అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. మేడి పండు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: May 28, 2025 | 10:42 AM

Share
మేడిపండు..దీని హైబ్రిడ్ రకాలను అత్తిపండు, అంజీర అంటారు. మేడిపండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా, చేదుగా ఉండే మేడి పండు పండిన తరువాత పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడు రుచి కూడా తియ్యగా ఉంటుంది. అయితే, నాటు పండయిన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి.

1 / 5
మేడి పండ్లు, ఆకులు, బెరడు, వేర్లు ఔషధ సంపదగా పరిగణిస్తారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. కరోనా అనంతరం ప్రజలు మేడిపండును దాని కాండం, ఆకులు, పండ్లను విస్తృతంగా వినియోగించారు. దీని పండ్లు, ఆకులు, బెరడులు అంటువ్యాధులతో పోరాడే గొప్ప శక్తిని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
అయినప్పటికీ మేడిపండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి పండ్లకు మధుమేహాన్ని దూరం చేసే శక్తి ఉంది. కడుపు నొప్పి విషయంలో నాలుగు పండిన మేడి పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
మేడిపండులో పురుగులు ఉండడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల పురుగులే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అనేక పోషక విలువలు గల ఈ మేడిపండు తినేటప్పుడు జాగ్రత్తగా పురుగులు తీసి తినండి. అంతేగానీ, ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న ఈ పండు తినడం మానకూడదని నిపుణులు చెబుతున్నారు. మేడి పండ్లలో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది.

4 / 5
మేడి పండ్లు తినటం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తినటం వల్ల వయసు పైబడిన లక్షణాలు బయటపడకుండా ఉంటాయి. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, గొంతు నొప్పి, మంట, విరేచనాలను నయం చేయడానికి కూడా మేడిపండ్లు మంచి మందులా పనిచేస్తుంది.

5 / 5
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!

వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..

జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!

నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!

వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే

చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి

విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే