Gali Janardhana Reddy: పులి ఆకలితో ఉంది.. వేటాడే సమయంలో ఆ పులికి హద్దులేవీ ఉండవు.. పొలిటిక్ ఎంట్రీపై గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మైనింగ్ రారాజు గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? అందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారా..? కేసులు, దర్యాప్తులతో పుష్కర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి.. మళ్లీ పొలిటికల్ ఫ్యూచర్‌పై ఫోకస్ పెట్టబోతున్నారా.. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు. పులి ఆకలితో ఉంది.. వేటాడే సమయంలో ఆ పులికి కాంగ్రెస్, బీజేపీ అనే హద్దులేవీ ఉండవు.. దానికి వేటాడటం మాత్రమే తెలుసని మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి అన్న మాటలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.. బళ్లారిలోని ఓ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ మాటలన్నారు..ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్నప్పుడు ఓ బాలుడు పులి వేషంలో ఎదురొచ్చి.. తనని చూసి పులి వచ్చిందంటూ అభిమానంతో పిలిచాడని.. ఇప్పుడా పులి వేటాడటానికి సిద్ధమైందన్నారు గాలి జనార్ధాన్ రెడ్డి.
తాను రాజకీయాలకు దూరమై పుష్కర కాలం గడిచిందని, ఎంతమంది విమర్శిస్తున్నా అన్నీ మౌనంగా భరిస్తున్నానని, తనకు బెంగళూరులో విలాసంగా జీవించే అవకాశం ఉన్నా.. బళ్లారి ఒక్కటే తనకు ముఖ్యమన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ తాను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
తాము ఎప్పుడూ ప్రజల జేబులకు చిల్లు పెట్టలేదని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు. అదృష్టం కొద్దీ పైకి వచ్చిన వారని.. కొందరు హెలికాప్టర్‌ను కొన్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లాలంటే ఏడెనిమిది గంటలు పట్టేది. బళ్లారి ప్రజలకు సమయం ఇవ్వలేకపోయాను. హెలికాప్టర్‌లో బెంగుళూరుకు రెండు గంటల్లో చేరుకుని బళ్లారి ప్రజలతో గడిపినట్లు జనార్దన రెడ్డి వెల్లడించారు.
తనపై నమోదైన కేసులు, జరుగుతున్న దర్యాప్తుల్లో తనకు న్యాయం దొరుకుతుందనే నమ్మకం తనకుందన్నారు. సో.. త్వరలో గాలి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారన్నమాట.
మరిన్ని జాతీయ వార్తల కోసం