Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ సీఎం

|

Apr 16, 2023 | 1:27 PM

కర్ణాటక బీజేపీకి అసెంబ్లీ ఎన్నిక వేళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ దక్కకపోవడంతో ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు.

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ సీఎం
Jagadish Shettar
Follow us on

కర్ణాటక బీజేపీకి అసెంబ్లీ ఎన్నిక వేళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్లీ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ దక్కకపోవడంతో ఆయన పార్టీపై తిరుగుబాటు చేశారు. దశాబ్దాల పాటు బీజేపీకి సేవలు చేసినందుకు తనకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని అన్నారు జగదీశ్‌ శెట్టార్‌. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలా ? లేక ఇతర పార్టీలో చేరాలా ? అన్న విషయంపై త్వరలో క్లారిటీ ఇస్తానని అన్నారు. జగదీశ్‌ శెట్టార్‌కు నచ్చచెప్పడానికి బీజేపీ హైకమాండ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్రం మంత్రి ప్రహ్లాద్‌జోషి చివరిక్షణం వరకు ఆయనకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. బీజేపీ జాబితాలో 54 మందికి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. పలువురు సీనియర్లకు ఈసారి టిక్కెట్లు ఇవ్వలేదు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సావడికి అతాని సీటును కేటాయించారు.

రాహుల్ సమక్షంలో..

కాగా జగదీశ్‌ శెట్టార్‌ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కర్ణాటక రాజకీయాల్లో ఆరితేరిన జగదీశ్‌ శెట్టార్‌ హఠాత్తుగా రాజీనామా చేయడంతో అధికార బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బేనని భావించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..