చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై.. తమిళిసైని అమిత్ షా మందలించారా.. ఇదిగో క్లారిటీ..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన విషయాలను మాజీ గవర్నర్ తమిళిసై తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన పరిస్థితులను, రాజకీయ పరిణామాలను గురించి అడిగి తెలుసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు జూన్ 12న అమరావతిలోని కేసరపల్లిలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి తమిళిసైతో కొన్ని సెకన్లపాటు మాట్లాడారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన విషయాలను మాజీ గవర్నర్ తమిళిసై తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన పరిస్థితులను, రాజకీయ పరిణామాలను గురించి అడిగి తెలుసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడు జూన్ 12న అమరావతిలోని కేసరపల్లిలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి తమిళిసైతో కొన్ని సెకన్లపాటు మాట్లాడారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామళై విషయంలో జోక్యం చేసుకోవద్దని వారించినట్లు కొందరు దుష్ప్రచారం చేశారు. అలాగే తమిళనాట కమలం పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాల్లో తలదూర్చవద్దని హెచ్చరించినట్లు కొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీనిపై స్పందించిన మాజీ గవర్నర్ తమిళిసై తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.
யார் பாத்த வேலயா இது.. 😂😂 pic.twitter.com/QGzxNXygad
— Kovai Harish (@KovaiHarish) June 12, 2024
గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడం జరిగిందన్నారు. ఆ వేదికపై తమిళనాడులో ఎన్నికల తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అడిగి తెలుకున్నట్లు తెలిపారు. కౌంటింగ్ తరువాత ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడగడానికి ఆయన తనను పిలిచినట్లు స్ఫష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయనకు వివరిస్తున్నప్పుడు చాలా శ్రద్ధతో విన్నారన్నారు. ఆ వేదికపై సమయాభావం కారణంగా, రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, నియోజకవర్గ సమస్యలు, అధిగమించేందుకు చేపట్టాల్సిన పనులపై శ్రద్ద నిర్వహించమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ రకమైన ప్రోత్సాహం రాజకీయ నాయకులకు ధీమాను, భరోసాను కల్పిస్తుందని చెప్పారు. తమిళనాడు బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందన్న పుకార్లపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అనవసరమైన ఊహాగానాలకు తెరదించుతూ ఒక స్పష్టత ఇవ్వడానికి ఈ ట్వీట్ దోహదపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమిళసై సౌందరరాజన్ దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. డిఎంకెకు చెందిన తమిజాచి తంగపాండియన్ చేతిలో ఓటమిపాలయ్యారు.
Yesterday as I met our Honorable Home Minister Sri @AmitShah ji in AP for the first time after the 2024 Elections he called me to ask about post poll followup and the challenges faced.. As i was eloborating,due to paucity of time with utmost concern he adviced to carry out the…
— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம்) (@DrTamilisai4BJP) June 13, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..