భారత్‌లో MSME కంపెనీల హవా.. 23 కోట్ల మందికి ఉపాధి సృష్టించి రికార్డు: ఉద్యమ్‌ పోర్టల్‌ వెల్లడి

దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో MSME కంపెనీలు రికార్డు సృష్టించాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు రంగాల్లో దాదాపు 23 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ మేరకు ఉద్యమ్ పోర్టల్ లో అధికారిక గణాంకాలు వెల్లడించాయి..

భారత్‌లో MSME కంపెనీల హవా.. 23 కోట్ల మందికి ఉపాధి సృష్టించి రికార్డు: ఉద్యమ్‌ పోర్టల్‌ వెల్లడి
MSME jobs in India
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 21, 2024 | 2:33 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 21: దేశ యువతకు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కంపెనీలు ఇప్పటి వరకూ ఇచ్చిన మొత్తం ఉద్యోగాలు 23 కోట్ల మార్కు దాటినట్లు తాజా ప్రభుత్వ గణాంకాలు విల్లడించాయి. గడచిన 15 నెలల వ్యధిలోనే దేశంలో దాదాపు 10 కోట్ల ఉద్యోగాలు మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (MSMEs) కల్పించినట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాలు తెల్పాయి. ఈ మేరకు ఉద్యమ్‌ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వ లెక్కలు తెల్పుతున్నాయి. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న 5.49 కోట్ల MSME సంస్థలు దేశ వ్యాప్తంగా 23.14 కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు నివేదించాయి. గత ఏడాది ఆగస్టు నాటికి 2.33 కోట్ల MSMEలు నమోదు చేసుకోగా.. వాటిల్లో 13.15 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పోర్టల్‌ గణాంకాలు వెల్లడించాయి.

ఉద్యమం సర్టిఫికేషన్ ద్వారా ప్రభుత్వంలో నమోదైన 2.38 కోట్ల అనధికారిక మైక్రో యూనిట్ల ద్వారా మొత్తం ఉపాధి 2.84 కోట్ల ఉద్యోగాలు కల్పించారు. అలాగే 5.23 కోట్ల మంది మహిళలకు ఉపాధిని అందించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న మొత్తం 5.41 కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ యూనిట్లలో సూక్ష్మ సంస్థలు 7.27 లక్షలు ఉండగా.. మధ్యతరహా పరిశ్రమలు 68,682 మాత్రమే ఉన్నాయి. జూలై 2020లో Udyam పోర్టల్ ప్రారంభ సమయంలో 2.8 కోట్ల MSME ఉద్యోగాలు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా MSME మంత్రిత్వ శాఖ వార్షిక నివేదికల్లో2015-16 నాటి జాతీయ నమూనా సర్వే ప్రకారం.. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలోని ఇన్కార్పొరేటెడ్ నాన్ అగ్రికల్చర్ యూనిట్లలో 11.10 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. వీటిల్లో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో.. 360.41 లక్షల ఉద్యోగాలు మ్యానుఫ్యాక్చరింగ్‌, 0.07 లక్షల ఉద్యోగాలు నాన్ క్యాప్టివ్ విద్యుత్ ఉత్పత్తిలో, 387.18 లక్షల ఉద్యోగాలు ట్రేడ్‌, 362.82 లక్షల జాబ్స్‌ ఇతర సర్వీసుల్లో యువతకు అందించారు.

RBI డేటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 46.7 మిలియన్ ఉద్యోగాలు అంటే 4.67 కోట్ల ఉపాది అవకాశాలు సృష్టించారు. దీంతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 643.3 మిలియన్లకు చేరుకుంది. అంటే 64.33 కోట్ల ఉద్యోగాలన్నమాట. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం అగ్రికల్చర్‌ ఉద్యోగాల వాటా ఇందులో 45 శాతానికి (దాదాపు 25-29 కోట్ల ఉద్యోగాలు) పైగానే ఉంది. MSME సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ.. ఈ సంస్థల మూసివేత కారణంగా కొంత నష్టం కూడా జరిగింది. ఈ ఏడాది జూలైలో MSME మంత్రిత్వ శాఖ మంత్రి జితన్ రామ్ మాంత్రి పార్లమెంటులో పంచుకున్న డేటా ప్రకారం.. 2020 నుంచి దాదాపు 49,342 MSME సంస్థలు మూతపడ్డాయి. వీటి మూసివేత కారణంగా మొత్తం 3,17,641 మంది ఉపాధి కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?