కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు.. బయటపడ్డ రూ.200కోట్ల విదేశీ ఆస్తులు
హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ ఆస్తులపై ఐటీ అధికారులు చేసిన దాడులు ముగిశాయి. జూలై 23న ఆయనతో సహా కుటుంబ సభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపాయి. 13ప్రాంతాల్లో దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో మొత్తం రూ.200కోట్ల విదేశీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఆయన పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు వారు నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. అలాగే దాదాపు రూ.30కోట్ల […]
హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయ్ ఆస్తులపై ఐటీ అధికారులు చేసిన దాడులు ముగిశాయి. జూలై 23న ఆయనతో సహా కుటుంబ సభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపాయి. 13ప్రాంతాల్లో దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో మొత్తం రూ.200కోట్ల విదేశీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది. హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఆయన పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు వారు నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. అలాగే దాదాపు రూ.30కోట్ల మేర ఆయన పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వారికి ఆధారాలు లభించాయి.
కాగా ఇటీవల ఓ ప్రకటనను ఇచ్చిన ఐటీ శాఖ.. పొరుగు రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం ఉన్న వారు, పదవుల్లో ఉన్న వారు కొన్ని దశాబ్దాలుగా పెద్ద ఎత్తున అక్రమ సంపాదనను సమకూర్చుకుంటున్నారు. వారి నగదు అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి అని పేర్కొంది. ఆ ప్రకటనలో కుల్దీప్ పేరు వెల్లడించకపోయినప్పటికీ.. ఇవి ఆయనను ఉద్దేశించి చెప్పినవేని తెలుస్తోంది. కాగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడైన కుల్దీప్ లాల్.. ప్రస్తుతం అదప్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.