AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పది మంది మృతి

ఉత్తర, ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల దాటికి ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిక్కిం – డార్జిలింగ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఇక జార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. లొతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇక అసోంలో వరదల దాటికి దాదాపు 1500కు […]

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పది మంది మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2019 | 12:07 AM

Share

ఉత్తర, ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల దాటికి ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిక్కిం – డార్జిలింగ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.

ఇక జార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. లొతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇక అసోంలో వరదల దాటికి దాదాపు 1500కు పైగా గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ధీమాజీ, కోక్రాఝర్,బిశ్వనాథ్, సోనిట్‌పుర్, డరాంగ్, బక్సా, బర్పేట, నల్బరీ,చైరంగ్, బోంగాయ్‌గావ్,లఖీంపూర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

బ్రహ్మపుత్రా నది పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. అధికారులు, సైనికులు రంగంలోకి దిగి సహయం అందిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Follow Us
ఏమున్నా్డ్రా బాబూ.. స్టన్నింగ్ లుక్‏తో టాలీవుడ్ హీరో..
ఏమున్నా్డ్రా బాబూ.. స్టన్నింగ్ లుక్‏తో టాలీవుడ్ హీరో..
అమరావతి రాజధానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తెలుపు,బ్రౌన్ కాదు,ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోయే గుడ్లు!ఆ పక్షి
తెలుపు,బ్రౌన్ కాదు,ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోయే గుడ్లు!ఆ పక్షి
సముద్ర గర్భంలో కాస్ట్‌లీ మందు సీసాలు..ఒక్కో బాటిల్‌కు రూ. కోట్లు!
సముద్ర గర్భంలో కాస్ట్‌లీ మందు సీసాలు..ఒక్కో బాటిల్‌కు రూ. కోట్లు!
6 విత్తనాల పవర్ లడ్డు.. రోజుకు ఒక్కటి తింటే కొండంత బలం మీ సొంతం
6 విత్తనాల పవర్ లడ్డు.. రోజుకు ఒక్కటి తింటే కొండంత బలం మీ సొంతం
ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న!
ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న!
పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే..
పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే..
తామరగింజల మసాలా మిక్చర్.. దీని ముందు నాన్ వెజ్ కూరలు కూడా జుజుబీ
తామరగింజల మసాలా మిక్చర్.. దీని ముందు నాన్ వెజ్ కూరలు కూడా జుజుబీ
వర్షాకాలంలో ఇవి ఇస్తే సన్నజాజి పూలు సంవత్సరమంతా విరగబూస్తాయ్..
వర్షాకాలంలో ఇవి ఇస్తే సన్నజాజి పూలు సంవత్సరమంతా విరగబూస్తాయ్..
బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం..!
బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం..!