AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంగానదిలో తేలుతూ కనిపించిన వందల కిలోల బరువైన బండరాయి.. ఎగబడి పూజలు చేస్తున్న భక్తులు

సనాతన సంస్కృతిలో, ప్రతి కణంలో దేవుడు నివసిస్తున్నాడని ప్రజలు గట్టిగా నమ్ముతారు. సమాజంలో వెలుగు చూసే కొన్ని కొన్ని విషయాలు ఇలాంటి నమ్మకాన్ని మరింత బలపరచడమే కాకుండా.. వారి నమ్మకాలు నిజమైనవే అనే భావనను కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఘాజీపూర్‌లోని దాద్రి ఘాట్ వద్ద గంగా నదిలో తేలియాడే ఒక పెద్ద రాయి కనిపించడం ప్రజల్లో ఉన్న ఈ నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఈ భారీ బండరాయిని చూసి స్థానికులు ఇది ఆ శ్రీరామచంద్రుడి మహత్యమేని భావిస్తూ పూజలు చేస్తున్నారు.

గంగానదిలో తేలుతూ కనిపించిన వందల కిలోల బరువైన బండరాయి.. ఎగబడి పూజలు చేస్తున్న భక్తులు
Ramsetu
Anand T
|

Updated on: Jul 19, 2025 | 6:17 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని గంగా నది ఒడ్డున ఉన్న దాద్రి ఘాట్‌పై ఒక పెద్ద రాయి తేలుతున్నట్లు కనిపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే, ఈ రాయి బరువు సుమారు 2-3 మూడు క్విటాళ్లు ఉన్నప్పటికీ ఇది నీటిలో తేలుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ రాయిని కదిలించేందుకు చాలా మంది ప్రయత్నించినా దాన్ని ఎత్తలేకపోయారు. దీంతో ఈ రాయిని శ్రీరాముని మహత్యంగా భావించి వాళ్లు పూజలు చేస్తున్నారు. అయితే ఇలాంటి రాళ్ల గురంచి మనం మన ఇతిహాస గ్రంథాలైన రామాయనంలో చూడవచ్చు. రామాయణ యుగంలో ఇటువంటి తేలియాడే రాళ్ల గురించి ప్రస్తావించబడింది. త్రేతా యుగంలో, రాముడు లంకపై దాడి చేయడానికి రామసేతును నిర్మించడానికి ఇటువంటి రాళ్లను ఉపయోగించాడని చెబుతారు.

ఘాజీపూర్ జిల్లాలో తేలియాడే రాయి ఉందన్న తెలిసిన తర్వాత చాలా మంది ప్రజలు ఇక్కడకు చేరుకున్నారు.ఇది రామాయణ కాలం నాడు సముద్రంలో రామసేతు నిర్మించడానికి ఉపయోగించిన రాయేనని నమ్మూతూ దానికి పూజలు చేస్తున్నారు. అయితే శుక్రవారం రోజు గంగానదిలో స్నానం చేయడానికి వచ్చిన సోను అనే బాలుడు ఈ రాయిని గమనించాడు. నది ఒడ్డు నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో ఏదో కదులుతున్నట్టు గుర్తించిన బాలుడు దగ్గరకు వెళ్లి చశాడు. అక్కడ భారీ ఆకారంలో ఉన్న రాయిని చూసి దానిని ఒడ్డుకు చేర్చి తాళ్లతో కట్టేశాడు. ఇక ఉదయం స్నానం చేయడానికి గంగా ఘాట్ వచ్చిన భక్తులు నదిలో తేలుతున్న కనిపించిన రాయిని చూశారు. ఇది రామసేతు రాయిగా భావించి వెంటనే పూజలు చేయడం ప్రారంభించారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..