మహద్ ఘటనలో 18 గంటల తరువాత , 5 ఏళ్ళ బాలుడికి విముక్తి

మహారాష్ట్రలోని మహద్ లో బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో సహాయక బృందాలు 5 ఏళ్ళ బాలుడిని అతి కష్టమ్మీద రక్షించాయి. 18 గంటల అనంతరం ఆ బాలుడిని సజీవంగా బయటికి తీసి రక్షించారు. గ్లాస్ కట్టర్, ఇతర యంత్రాల సాయంతో శిథిలాలను తొలగించి ఈ చిన్నారిని కాపాడినట్టు అధికారులు తెలిపారు. భయంతో బిక్క ముఖం వేసుకుని చూస్తున్న ఈ బాలుడిని వెంటనే దగ్గరలోని అంబులెన్స్ లోకి తరలించారు. హాస్పిటల్ లో ఈ చిన్నారి కి మెడికల్ చెకప్, ఇతర […]

మహద్ ఘటనలో 18 గంటల తరువాత , 5 ఏళ్ళ బాలుడికి విముక్తి
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 25, 2020 | 5:06 PM

మహారాష్ట్రలోని మహద్ లో బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో సహాయక బృందాలు 5 ఏళ్ళ బాలుడిని అతి కష్టమ్మీద రక్షించాయి. 18 గంటల అనంతరం ఆ బాలుడిని సజీవంగా బయటికి తీసి రక్షించారు. గ్లాస్ కట్టర్, ఇతర యంత్రాల సాయంతో శిథిలాలను తొలగించి ఈ చిన్నారిని కాపాడినట్టు అధికారులు తెలిపారు. భయంతో బిక్క ముఖం వేసుకుని చూస్తున్న ఈ బాలుడిని వెంటనే దగ్గరలోని అంబులెన్స్ లోకి తరలించారు. హాస్పిటల్ లో ఈ చిన్నారి కి మెడికల్ చెకప్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ బాలుడి తాలూకు తలిదండ్రులెవరో ఏమయ్యారో తెలియడంలేదు.