Five percent additional tax on foreign exchange: విదేశాల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? వారికి డబ్బు పంపాలా ? ఇప్పటి వరకు లేని కొత్త పన్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. విదేశాల నుంచి డబ్బు వచ్చినా.. ఇక్కడ్నించి మనం విదేశాల్లో వున్న వారికి డబ్బు పంపినా అదనంగా 5 శాతం పన్ను విధించాలన్న రిజర్వు బ్యాంకు ఆదేశాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో విదేశీ చదువు మరింత భారం కాబోతోంది. ఎందుకంటే విదేశీ మారకంపై అదనంగా 5 శాతం పన్ను వసూలు చేయాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది.
అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో పలు బ్యాంకింగ్ మార్పులు రాబోతున్నాయి. విదేశాల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడాలన్నా.. విదేశాల నుంచి ఆన్ లైన్ లావాదేవీలు జరపాలన్న ఇకపై ముందస్తుగా ఆ ఖాతాదారులు సంబంధిత బ్యాంకులో నమోదు చేసుకుని వుండాల్సిన అవసరం వుంది. అంటే తమ కార్డులు కేవలం డొమెస్టిక్ పర్పసా లేక ఇంటర్నేషనల్‌గా వినియోగించుకోవాలా అన్నది ముందుగా సంబంధిత బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఈ మేరకు ఆర్బీఐ మార్పులు చేసింది.
ఇదే విధంగా విదేశాలకు పంపే డబ్బుపైన కూడా ఇకపై అదనంగా 5 శాతం పన్ను వసూలు చేయాలని బ్యాంకులను ఆదేశించింది రిజర్వు బ్యాంకు. ఈ పన్ను విధింపు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. లక్ష రూపాయలు పంపితే.. అదనంగా 5 వేల రూపాయలు పన్ను రూపంలో బ్యాంకులు కట్ చేసుకునే అవకాశాన్ని రిజర్వు బ్యాంకు కలిపిస్తోంది. ఈరకంగా ప్రజల నెత్తిన అదనపు భారం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.
Also read: ఏపీలో నవశకం.. ఎరువుల పంపిణీలో కొత్త సిస్టమ్
Also read: ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట
Also read: క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు
Also read: ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు