జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్ మావోయిస్టు పార్టీ సెక్రటరీ అరుణ్‌తో పాటు అగ్రనేతలు మరణించినట్టుగా తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టులపై రూ. 25 లక్షల రివార్డు ఉంది.
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గౌతం పాశ్వాన్, ఛార్లెస్ ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరిపై రూ. 25 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మిగతా మావోయిస్టుల తలపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
దట్టమైన అటవీప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు, కోబ్రా దళాలు కూంబింగ్ చేపట్టినప్పుడు మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పల్లో ఐదుగురు చనిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..