చివరకు కోర్టులు కూడా క్రిమినల్స్ ని భయపెట్టలేకపోతున్నాయి. సాక్షాత్తూ కోర్టులోనే దారుణ నేరాలు జరుగుతున్నాయంటే ఇక న్యాయవ్యవస్థ ఎటు వైపు వెళ్తోందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. . కేసు విచారణకు హాజరైన ఓ వ్యక్తిని కోర్టులోనే ఒకరు కాల్చి చంపి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లాయర్లు, ఇంకా పలువురు సాక్షులు అక్కడ ఉండగానే ఈ ఘటన జరిగింది. బుల్లెట్ గాయాలకు గురైన మృతుడిని ఉపకార్ గా గుర్తించారు. అరుణ్ శర్మ అనే అడ్వొకేట్ కి ఉద్దేశించిన 444 నెంబర్ ఛాంబర్ లో ఈ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసు విచారణకు హాజరయ్యేందుకు ఉపకార్ కోర్టుకు వచ్చినట్టు తెలిసింది. కాగా కాల్పులు జరిపిన వ్యక్తిని ఓ లాయర్ గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.