నడుస్తున్న రైలులో మంటలు చెలరేగాయి. రైలు ఇంజిన్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బీహార్‌లోని తూర్పు చంపారం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బెల్వా స్టేషన్ సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగింది. రైలు రక్సాల్ నుంచి నర్కతియాగంజ్‌కు వెళుతోంది. బెల్వా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైల్లో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలతో మంటలు చెలరేగటంతో ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. కానీ, అదృష్టవశాత్తు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Bihar | Fire broke out in engine of a DMU train near Bhelwa railway station earlier this morning. The train was going from Raxaul to Narkatiaganj. Cause of the fire yet to be ascertained. All passengers are safe, fire from the engine did not spread. Fire fighting ops are underway
ఇవి కూడా చదవండి— ANI (@ANI) July 3, 2022
రైల్లో మంటలంటుకున్నాయని తెలిసి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు మరింత తీవ్రం కాకుండా అగ్నిమాపక సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేశారు. అయితే, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి