మాల్‌లో చెలరేగిన మంటలు.. భారీగా ఆస్తినష్టం

మాల్‌లో చెలరేగిన మంటలు.. భారీగా ఆస్తినష్టం

యూపీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని స్పైస్ మాల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. నొయిడా సెక్టార్ 25ఏ‌లో ఉన్న ఈ మాల్‌లోని నాలుగో అంతస్తులో ఈ ఘటన జరిగింది. మంటలు ఎగిసి పడడంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. నొయిడా స్టేడియానికి ఎదురుగా ఉండే ఈ షాపింగ్ మాల్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 5:34 PM

యూపీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని స్పైస్ మాల్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. నొయిడా సెక్టార్ 25ఏ‌లో ఉన్న ఈ మాల్‌లోని నాలుగో అంతస్తులో ఈ ఘటన జరిగింది. మంటలు ఎగిసి పడడంతో సమీప ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్మేసింది. నొయిడా స్టేడియానికి ఎదురుగా ఉండే ఈ షాపింగ్ మాల్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

కాగా, ఉదయం మరో చోట కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాస్నాలోని సూరజ్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. మెంథాల్ పెద్దమొత్తంలో నిల్వచేసిన ఓ ప్రైవేటు సంస్థ గోదాములో మంటలు చెలరేగగా, వాటిని అదుపు చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu