AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పై పోలీసు కేసు.. …బీఎస్పీ అభ్యర్థికి లంచం ఇచ్చారా ?

కేరళ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు...

కేరళ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పై పోలీసు కేసు.. ...బీఎస్పీ అభ్యర్థికి లంచం ఇచ్చారా ?
K.surendran
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 07, 2021 | 12:48 PM

Share

కేరళ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకునేలా చూసేందుకు ఈయన అతనికి లంచం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కసర్గఢ్ జిల్లాలోని మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కె.సుందర అనే వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేయగోరి నామినేషన్ వేశారు. అయితే నీ నామినేషన్ ఉపసంహరించుకుంటే నీకు మొదట 2.5 లక్షలు, స్మార్ట్ ఫోన్, ఆ తరువాత 15 లక్షలు, ఇల్లు, కర్ణాటకలో వైన్ షాపు కూడా ఇప్పిస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. తాను 15 లక్షలు, కర్ణాటకలో వైన్ షాపు ఇప్పించాలని కోరానని, కానీ నామినేషన్ ఉపసంహరించుకున్న అనంతరం తనకు 2.5 లక్షలు, 15 వేలరూపాయల విలువ చేసే స్మార్ట్ ఫోన్ మాత్రమే ఇచ్చారని సుందర తెలిపారు. కాగా ఎన్నికలు ముగిసిన అనంతరం తననెవరూ పట్టించుకోలేదన్నారు. దీంతో తాను కేసు పెట్టానన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు నిరాధారమైనవంటూ కొట్టి పారేశారు. ఆయనకు తామేమీ లంచం ఇవ్వజూపలేదని, పైగా ఎందుకు నామినేషన్ ఉపసంహరించుకున్నదీ ఆయనే స్వయంగా చెప్పాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్ అన్నారు. బహుశా సీపీఐ (ఎం) నుంచో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచో వచ్చిన ఒత్తిడి కారణంగా సుందర ఈ ఆరోపణలు చేసినట్టు కనిపిస్తోందన్నారు.

అటు-కేరళ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. 2016 లో ఒక సీటును గెలుచుకోగా ఈ సారి కనీసం ఒక్క స్థానాన్నయినా దక్కించుకోలేకపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: విరాట్‌ కోహ్లీకి తాను పెద్ద ఫ్యాన్‌ని అంటున్న పాక్‌ బౌలర్‌ భార్య

Corona: దేశీయ విమాన ప్ర‌యాణికుల‌కు ఇక‌పై నెగిటివ్ రిపోర్ట్‌ అవ‌స‌రం లేదు? ఈ ఛాన్స్ వారికి మాత్ర‌మే..

పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్