పీవీ, మన్మోహన్ విధానాలే భేష్.. పరకాల ప్రభాకర్

  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త, పొలిటికల్ ఎకనామిస్ట్ కూడా అయిన పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న తీరు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ డైలీకోసం రాసిన ఆర్టికల్ లో ఆయన.. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలే భేష్ అని అభిప్రాయపడ్డారు. లోగడ.. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్… పీవీ, మన్మోహన్ పాటించిన ఆర్ధిక […]

పీవీ, మన్మోహన్ విధానాలే భేష్.. పరకాల ప్రభాకర్
Follow us

|

Updated on: Oct 14, 2019 | 5:06 PM

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ భర్త, పొలిటికల్ ఎకనామిస్ట్ కూడా అయిన పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్ధిక మాంద్యం పెరుగుతున్న తీరు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ డైలీకోసం రాసిన ఆర్టికల్ లో ఆయన.. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్ధిక విధానాలే భేష్ అని అభిప్రాయపడ్డారు. లోగడ.. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్… పీవీ, మన్మోహన్ పాటించిన ఆర్ధిక విధానాలు నేటికీ సవాలు చేయలేనివిధంగా, ఉద్దీపనతో కూడినవిగా ఉన్నాయన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించడానికి సిధ్దంగా లేదని పేర్కొన్నారు. నాటి ఆ ఇద్దరు ప్రధానులూ పాటించిన విధానం ఆర్ధిక సరళీకరణకు మార్గాన్ని సుగమం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం నెహ్రు హయాంలోని సోషలిజాన్ని విమర్శించే బదులు.. ఆ పాలసీలను పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదనను అంగీకరించడానికి ఈ ప్రభుత్వం సిధ్ధంగా లేదు. వాస్తవాలను ఒప్పుకోవడానికి విముఖత చూపుతోంది.. ఒకదాని తరువాత ఒకటిగా ఆయా రంగాలు పడిపోతున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అని ఆయన అన్నారు. ‘ బీజేపీ పొలిటికల్ ప్రాజెక్ట్ లో సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఓ ‘ యోధుని ‘ గా ఎలా ఉన్నారో.. అలాగే దేశ ఆర్ధిక సంస్కరణల్లో పీవీ కూడా ఉన్నారు ‘ అన్నారాయన. అధికార పార్టీ చర్య ఆర్ధిక విమర్శగా లేదని, అది రాజకీయ దాడిగానే మిగిలిపోయిందని.. కానీ ఈ విషయాన్ని పార్టీ ఇంకా గుర్తించడం లేదని పరకాల పేర్కొన్నారు. బీజేపీలోని మేధావి వర్గం ఎంతసేపూ విమర్శలు చేస్తున్నంత మాత్రాన.. అవి ఎకానమీ పురోగమనానికి దారి తీస్తాయా అని ప్రశ్నించారు. కాగా- ఈ ఆర్టికల్ గురించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించినప్పుడు.. జీఎస్టీ, ఆధార్ వంటి పథకాలు, ఇతర ప్రజా ప్రయోజన కార్యక్రమాలు ఎకానమీ వృద్దికి దోహదపడడం లేదా అని క్లుప్తంగా వ్యాఖ్యానించారు. ఆర్ధిక వృద్ద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అటు-తాజాగా ప్రపంచ బ్యాంకు భారత్ కు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ది రేటును ఒకటిన్నర శాతానికి కుదించిన విషయం గమనార్హం.